తెలుగు న్యూస్  /  Business  /  Hdfc Q2 Pat Rises By 18 Percent Yoy To 4454 Crore Rupees Beats Estimates

HDFC Q2 results: అంచనాలను మించిన హెచ్‌డీఎఫ్‌సీ లాభాలు

HT Telugu Desk HT Telugu

03 November 2022, 15:45 IST

    • HDFC Q2 results: హెచ్‌డీఎఫ్‌సీ క్యూ 2లో అంచనాలను మించి లాభాలు సాధించింది.
హోం లోన్లకు డిమాండ్ పటిష్టంగా కొనసాగుతోందన్న హెచ్‌డీఎఫ్‌సీ
హోం లోన్లకు డిమాండ్ పటిష్టంగా కొనసాగుతోందన్న హెచ్‌డీఎఫ్‌సీ (HT_PRINT)

హోం లోన్లకు డిమాండ్ పటిష్టంగా కొనసాగుతోందన్న హెచ్‌డీఎఫ్‌సీ

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో నికర లాభం రూ. 4,454.24 కోట్లు ఆర్జించింది. గత ఏడాది రెండో త్రైమాసికంతో పోల్చితే 17.8 శాతం ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో క్యూ1తో పోలిస్తే ఈ క్యూ2లో పన్ను అనంతర లాభం 21.4 శాతం పెరిగింది. మొత్తంగా హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ నిపుణుల అంచనాలను మించి పనితీరు కనబరిచింది.

ట్రెండింగ్ వార్తలు

Changes from May 1 : మే 1 నుంచి ఈ విషయాల్లో భారీ మార్పులు.. కచ్చితంగా తెలుసుకోవాలి

Best Mutual Funds : ఏడాది కాలంలో అద్భుత రిటర్నులు ఇచ్చిన టాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవే..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 155 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ ప్రాఫిట్స్​!

Mahindra XUV 3XO launch : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ లాంచ్​.. ధర ఎంతంటే!

హెచ్‌డీఎఫ్‌సీ నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ (ఎన్ఐఐ) రూ. 4,639 కోట్లుగా ఉంది. గత ఏడాది క్యూ2లో వచ్చిన రూ. 4,108 కోట్ల కంటే 12.9 శాతం పెరిగింది.

నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌‌కమ్‌ (ఎన్ఐఐ) పైన మానిటరీ పాలసీ విధానం, వడ్డీ రేట్ల పెరుగుదల స్వల్ప కాలానికి ప్రభావం చూపిందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ (ఎన్ఐఎం)పై కూడా స్వల్పంగా ప్రభావం చూపిందని తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధ సంవత్సరం వ్యక్తిగత రుణాల ఆమోదాలు, పంపిణీ వరుసగా 35 శాతం, 36 శాతం పెరిగాయి. ముఖ్యమంగా హోమ్ లోన్లకు పటిష్టమైన డిమాండ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ చూసింది.

‘హోమ్ లోన్లకు డిమాండ్ పటిష్టంగా కొనసాగుతోంది. హోమ్ లోన్లలో పెరుగుదల అటు మిడ్ ఇన్‌కమ్ సెగ్మెంట్లోనూ, ఇటు విలాసవంతమైన ఆస్తుల విషయంలోనూ కనిపించింది..’ అని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.

సెప్టెంబరు 30తో ముగిసిన తొలి అర్ధ సంవత్సరంలో కొత్తగా రుణాలకు వచ్చిన దరఖాస్తుల్లో 92 శాతం డిజిటల్ ఛానెల్స్ ద్వారానే వచ్చినట్టు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. వ్యక్తిగత రుణాల సగటు కూడా రూ. 35.7 లక్షలుగా ఉందని, అంతకుముందు ఏడాది ఇది రూ. 33.1 లక్షలుగా ఉందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. ఆయా ఇండివిడ్యువల్ రుణాల వసూళ్లు కూడా సమర్థవంతంగా సాగాయాని వివరించింది.

సెప్టెంబరు 30, 2022 నాటికి హెచ్‌డీఎఫ్‌సీ‌ నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ రూ. 6,90,284 కోట్లుగా ఉందని, గత ఏడాది ఇది రూ. 5,97,339 కోట్లుగా ఉందని వివరించింది. మొత్తంగా 81 శాతం ఇండివిడ్యువల్ రుణాలేనని తెలిపింది.