తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price: బంగారం ధరకు బ్రేక్.. వెండి మరింత పైకి..

Gold Price: బంగారం ధరకు బ్రేక్.. వెండి మరింత పైకి..

16 March 2023, 5:40 IST

    • Gold Rate Today, Silver Price: పసిడి రేట్ల పెరుగుదలకు కాస్త బ్రేక్ పడింది. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మరోవైపు వెండి రేటు మాత్రం అధికమైంది.
Gold Price: బంగారం ధరలు నేడు ఇలా..
Gold Price: బంగారం ధరలు నేడు ఇలా.. (REUTERS)

Gold Price: బంగారం ధరలు నేడు ఇలా..

Gold Rate Today, Silver Price: పసిడి ధరలు కాస్త ఊరట కలిగించాయి. కొద్ది రోజులుగా బంగారం రేట్లు భారీగా పెరుగుతుండగా.. గత 24 గంటల వ్యవధిలో స్వల్పంగా తగ్గాయి. దీంతో పసిడి పరుగుకు కాస్త బ్రేక్ పడింది. గురువారం ఉదయం సమయానికి 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ ధర రూ.100 తగ్గి రూ.53,050కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.57,870కు దిగొచ్చింది. 24 క్యారెట్ల 1 గ్రాము రేటు రూ.5,787 వద్ద ఉంది. మరోవైపు వెండి ధరల పెరుగుదల కొనసాగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి తాజా ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

తెలుగు రాష్ట్రాల్లో..

Gold Price Today: హైదరాబాద్‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.53,050కు చేరింది. 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.57,870గా ఉంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో ఇదే ధరలు ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో..

Gold Rate Today: దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,200కు వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.58,020గా ఉంది. కోల్‍కతా, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.53,050గా ఉండగా.. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి వెల రూ.57,870కు చేరింది.

Gold Rate Today: కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల (10 గ్రాములు) పసిడి ధర రూ.53,100 చేరింది. 24 క్యారెట్లకు చెందిన మేలిమి బంగారం 10 గ్రాముల వెల రూ.57,920గా ఉంది. అహ్మదాబాద్‍లో ఇదే ధర ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800కు చేరింది. 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.58,690గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‍లో..

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్‍లో బుధవారం ఓ దశలో తగ్గినట్టు కనిపించిన స్పాట్ గోల్డ్ ధర మళ్లీ పెరిగింది. దీంతో గురువారం ఇండియాలోనూ ధరపై ప్రభావం పడొచ్చు. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1,922 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ ధరను బట్టి ఇండియాలో ప్రతీ రోజు ధరలు మారుతుంటాయి. ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి మారకం విలువ సహా పలు అంతర్జాతీయ కారణాల వల్ల గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక ప్రస్తుతం అమెరికా బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం పసిడి ధరలపై అధిక ప్రభావం చూపుతోంది. గోల్డ్ డిమాండ్‍లో ఒడిదొడుకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మళ్లీ పెరిగిన వెండి

Silver Rate Today: వెండి (సిల్వర్) ధర పెరుగుదల మాత్రం ఆగలేదు. దేశంలో కిలో వెండి ధర తాజాగా రూ.500 పెరిగి రూ.69,000కు చేరింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కిలో వెండి ధర రూ.72,500కు చేరింది. ఢిల్లీ, ముంబై, కోల్‍కతా, అహ్మదాబాద్, నగరాల్లో కిలో సిల్వర్ రేటు రూ.69,000కు చేరింది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)