తెలుగు న్యూస్  /  Business  /  Gold Price Drops Today Silver Is Stable Check Latest Gold White Metal Rates

Gold Rate Today: స్వల్పంగా దిగొచ్చిన పసిడి ధర.. స్థిరంగా వెండి.. నేటి ధరలు ఇవే

11 January 2023, 6:06 IST

    • Gold Price Today: బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. వెండి స్థిరంగా కొనసాగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
నేటి బంగారం ధరలు ఇలా..
నేటి బంగారం ధరలు ఇలా.. (MINT_PRINT)

నేటి బంగారం ధరలు ఇలా..

Gold Rate Today: ఇటీవలి కాలంలో జోరుగా పెరుగుతున్న బంగారం ధరకు కాస్త బ్రేక్ పడింది. పసిడి ధర నేడు (జనవరి 11) కాస్త తగ్గింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.150 తగ్గి రూ.51,450కు వచ్చింది. మరోవైపు 24 క్యారెట్ల రేటు కూడా స్వల్పంగా దిగివచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర నేడు రూ.160 తగ్గి రూ.56,130కు చేరింది. 100 గ్రాముల వెల రూ.5,61,300గా ఉంది. ప్రధాన నగరాల్లో నేడు పసిడి, వెండి ధలు ఎలా ఉన్నాయంటే..

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో..

Gold Rate Today in Hyderabad: హైదరాబాద్ మార్కెట్‍లోనూ పసిడి ధర నేడు కాస్త దిగివచ్చింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.51,450కు చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.56,130గా ఉంది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

ఇతర ప్రధాన నగరాల్లో..

Gold Price Today: దేశరాజధాని ఢిల్లీ సహా చాలా నగరాల్లో నేడు బంగారం రేటు స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి రేటు రూ.51,600గా ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,290కు చేరింది. కోల్‍కతా, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.56,130గా ఉంది.

అహ్మాదాబాద్‍లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.51,500గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.56,180కు దిగివచ్చింది. బెంగళూరు, పట్నాలోనూ ఇవే ధరలు ఉన్నాయి. చెన్నైలో 22 గ్రాముల 10 గ్రాము బంగారం రేటు రూ.52,370, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,130గా ఉంది.

మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్‍లో ముడి బంగారం ధరకు బ్రేక్ పడడం లేదు. స్పాట్ బంగారం ఔన్సు ధర నేడు సుమారు ఆరు డాలర్లు పెరిగి 1,876.36 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ మధ్య మదుపరులు బంగారంపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో డిమాండ్ పెరిగి పసిడి రేటు పెరుగుతోంది. ద్రవ్యోల్బణం కూడా ప్రభావం చూపుతోంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కాస్త మెరుగై.. రూ.81.63 వద్దకు చేరింది.

వెండి స్థిరంగా..

Silver Rate Today: దేశీయ బులియన్ మార్కెట్‍లో నేడు బంగారం ధర కాస్త తగ్గగా.. వెండి మాత్రం స్థిరంగా కొనసాగింది. నేడు కిలో వెండి ధర రూ.71,800గా ఉంది. మూడు రోజుల నుంచి వెండి ఇక్కడే స్థిరపడింది.

Silver price in Hyderabad: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో నేడు కిలో వెండి ధర రూ.73,700గా ఉంది. బెంగళూరు, చెన్నైలోనూ ఇవే ధరలు కొనసాగాయి. ఢిల్లీ, ముంబై, కోల్‍కతా, అహ్మదాబాద్‍లో కిలో వెండి దర రూ.71,800గా ఉంది.