iPhone 16 vs iPhone 15 : ఐఫోన్ 15తో పోల్చితే.. ఐఫోన్ 16లో వచ్చే అప్‌గ్రేడ్స్ ఇవే!
27 April 2024, 6:41 IST
Iphone 16 release date : ఐఫోన్ 16 వర్సెస్ ఐఫోన్ 15.. కొత్త ఐఫోన్ 16 మోడల్‌కు వస్తున్న అప్‌గ్రేడ్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఐఫోన్ 15 వర్సెస్ ఐఫోన్ 16
Iphone 16 price in India : యాపిల్ ఐఫోన్ 16 లాంచ్‌కు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. కానీ లాంచ్‌కు ముందే.. లీక్ అవుతున్న ఫీచర్స్.. ఐఫోన్ లవర్స్‌ని థ్రిల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఐఫోన్ 15 కొనాలా? లేక ఐఫోన్ 16 వచ్చేంత వరకు ఎదురు చూడాలా? అని మీరు ఆలోచిస్తుంటే.. ఇది మీకోసమే! ఐఫోన్ 15తో పోల్చితే.. ఐఫోన్ 16లో ఎలాంటి అప్డేట్స్ ఉంటాయో (రూమర్స్, లీక్స్ ప్రకారం) ఇక్కడ తెలుసుకుందాము..
ఐఫోన్ 16 వర్సెస్ ఐఫోన్ 15
- డిజైన్ అండ్ డిస్ప్లే: ఈ సంవత్సరం.. ఐఫోన్ 15 నుంచి ఐఫోన్ 16 ప్రధాన డిజైన్ అప్గ్రేడ్లను పొందే అవకాశం ఉంది. ఐఫోన్ 16లో డైనమిక్ ఐలాండ్, యాక్షన్ బటన్ ఉండే అవకాశం ఉంది. అదనంగా, ఐఫోన్ 16.. ఐఫోన్ 15 మోడల్ మాదిరిగా డయాగ్నల్ కెమెరా ప్లేస్మెంట్ ఉండదు. దాని స్థానంలో వర్టికల్ కెమెరా అమరికను పొందవచ్చు. ఇది కాకుండా ఐఫోన్ 16 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1 ఇంచ్ డిస్ప్లేను కొనసాగించే అవకాశం ఉంది. అదనంగా, ఐఫోన్ 16 రెండు కొత్త రంగులను పొందవచ్చు. అవి.. పర్పుల్, వైట్.
Iphone 15 vs Iphone 16 2. కెమెరా: ఐఫోన్ 16 కెమెరా విభాగంలో పెద్దగా అప్డ్రేడ్స్ ఉండకపోవచ్చు. అందువల్ల ఐఫోన్ 15 మోడల్ మాదిరిగానే.. ఇందులో 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండొచ్చు. అయితే కెమెరా పరంగా ఐఫోన్ 16 అప్‌గ్రేడ్ కోసం యాపిల్ ఏమి ప్లాన్ చేస్తుందో ఇంకా క్లారిటీ లేదు. లాంచ్‌కు కొన్ని నెలల సమయం ఉన్నందున.. ఈ మధ్యలో ఏదైనా తెలియొచ్చు.
3. పనితీరు: ఈ సంవత్సరం యాపిల్ అన్ని ఐఫోన్ 16 మోడళ్లకు కొత్త ఏ 18 చిప్సెట్ తీసుకురావచ్చు. యాపిల్ సప్లై చైన్ అనలిస్ట్ జెఫ్ పు నుంచి ఈ రూమర్ వచ్చింది. అందువల్ల ఐఫోన్ 16తో పనితీరును అప్‌గ్రేడ్ చేసి, ఐఓఎస్ 18 అప్డేట్తో ఏఐ ఫీచర్లను పొందే అవకాశం ఉంది. ప్రాసెసర్ అప్‌గ్రేడ్ వెనుక ఏఐ ఇంటిగ్రేషన్ కారణమని భావిస్తున్నారు.
Iphone 16 leaked features : 4. బ్యాటరీ: బ్యాటరీ పరిమాణం పరంగా చూస్తే ఐఫోన్ 16లో 3561 ఎంఏహెచ్ అప్‌గ్రేడెడ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఐఫోన్ 15లో 3349 ఎంఏహెచ్ బ్యాటరీ ఉందన్న విషయం తెలిసిందే. అందువల్ల, ఐఫోన్ 15 మోడల్ నుంచి ఐఫోన్ 16 మోడల్ మెరుగైన బ్యాటరీ లైఫ్ పొందవచ్చు.
సెప్టెంబర్ లో జరగనున్న లాంచ్ సందర్భంగా యాపిల్ ఐఫోన్ 16 గురించి మరిన్ని వివరాలు వెల్లడవుతాయి. కాబట్టి కొత్త తరం ఐఫోన్లతో యాపిల్ ఏం తీసుకురాబోతుందో వేచి చూడాల్సిందే.
పైన చెప్పిన ఐఫోన్ 16 అప్డేట్స్ అన్నీ ప్రస్తుతం రూమర్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. పక్కా క్లారిటీ రావాలంటే.. లాంచ్ వరకు ఎదురుచూడాల్సిందే!
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్లో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండటానికి హెచ్‌టీ తెలుగుని వాట్సప్‌లో ఫాలో అవ్వండి!