iPhone 16 price : ఐఫోన్ 16 సిరీస్‌లో 5 మోడల్స్.. ధరలు ఇవే!
iPhone 16 price prediction : ఐఫోన్ 16 సిరీస్‌పై తాజాగా ఓ నివేదిక బయటకు వచ్చింది. అందులో.. ఐఫోన్ 16 ప్రైజ్‌తో మరిన్ని ఎగ్జైటింగ్ వివరాలు ఉన్నాయి.
iPhone 16 release date : రూమర్స్, లీక్స్‌తో.. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ రిపోర్ట్స్.. యాపిల్ లవర్స్‌ని ఎంగేజ్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు.. ఓ కొత్త నివేదిక బయటకి వచ్చింది. ఐఫోన్ 16 సిరీస్‌లో 5 మోడల్స్ ఉంటాయని సమాచారం. వాటి ధరలకు సంబంధించిన వివరాలు కూడా అందులో ఉన్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఐఫోన్ 16 ధర వివరాలు..
టెక్ ఇన్సైడర్ మజిన్‌బు ప్రకారం.. ఐఫోన్ 16 సిరీస్‌లో ఎస్ఈ వేరియంట్ కూడా ఉంటుంది. ఐఫోన్ 16 ఎస్ఈ 128జీబీ ర్యామ్ ధర 699 డాలర్లు (సుమారు రూ. 58వేలు). ఇక ఐఫోన్ 16 ప్లస్ ఎస్ఈ 256 జీబీ వేరియంట్ ధర 799 డాలర్లు (సుమారు రూ. 66,300). ఇక స్టాండర్డ్/ బేసిక్ ఐఫోన్ 16 256జీబీ వేరియంట్ ధర 699 డాలర్లు (సుమారు రూ. 58వేలు). ఐఫోన్ 16 ప్రో 256జీబీ వేరియంట్ ధర 999 డాలర్లు (సుమారు రూ. 82,900). ప్రో మ్యాక్స్ 256జీబీ వేరియంట్ ధర 1099 డాలర్లు (సుమారు రూ. 91,200).
iPhone 16 launch : ఐఫోన్ 16 ధరపై అఫీషియల్ అప్డేట్ లేదు కానీ.. ప్రస్తుతం ఉన్న రూమర్స్‌తో లేటెస్ట్ ఐఫోన్ గ్యాడ్జెట్స్‌పై ఒక గ్లింప్స్ అందినట్టు అయ్యింది.
ఇక ఈ రూమర్స్‌లో హైలైట్ విషయం.. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో కొత్త మోడల్స్ ఉంటాయని చెప్పడం. అవి.. ఐఫోన్ 16 ఎస్ఈ, 16 ఎస్ఈ ప్లస్. వీటికి వరుసగా 6.1 ఇంచ్, 6.7 ఇంచ్ డిస్ప్లేలు ఉంటాయట. ఈ రెండింటిలోనూ డైమనిక్ ఐలాండ్ నాచ్ వస్తుంది.
iPhone 16 pro : ఇక ఐఫోన్ 16, 16 ప్రో మోడల్స్‌లో 6.3 ఇంచ్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో మాత్రం భారీ 6.9 ఇంచ్ డిస్ప్లే ఉంటుందని టాక్ నడుస్తోంది.
ఇక కెమెరా కాన్ఫిగరేషన్స్ విషయానికొస్తే.. ఐఫోన్ 16 ఎస్ఈ మోడల్స్‌లో సింగిల్ పిల్ షేప్‌లో రేర్ కెమెరా ఉండొచ్చు. ఐఫోన్ ఎక్స్‌లో కూడా ఇదే ఉంటుంది. కానీ స్డాండర్డ్ ఐఫోన్ 16లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ప్రో మోడల్స్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్‌లో ఇవే ఉంటాయి.
iPhone 16 price in India : అయితే.. ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అవుతుంది. అప్పటివరకు రూమర్స్ కొనసాగుతూనే ఉంటాయి. అవి.. ఐఫోన్ లవర్స్‌ని ఎంగేజ్ చేస్తూనే ఉంటాయి.
సంబంధిత కథనం