Factory reset Android smartphones : స్మార్ట్‌ఫోన్‌ని అమ్మేస్తున్నారా? ఇలా మీ డేటాను కాపాడుకోండి..
20 April 2024, 7:41 IST
How to factory reset Android smartphones : మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ని ఎవరికైనా విక్రయించాలనుకుంటే, మీ వ్యక్తిగత డేటా దుర్వినియోగం కాకుండా ఉండటానికి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ని సరిగ్గా రీసెట్ చేయాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి..
మీ స్మార్ట్‌ఫోన్‌ని ఫ్యాక్టరీ రీసెట్ చేయాలా? ఇక్కడ తెలుసుకోండి..
How to factory reset Android smartphone : మీ స్మార్ట్‌ఫోన్ పనితీరుతో మీరు అసంతృప్తిగా ఉన్నారా? అయితే మీరు ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ గురించి తెలుసుకోవాల్సిందే! అనవసరమైన యాప్స్‌ని తొలగించి, మొదట్లో ఎలా ఉండేదో, అదే స్థితికి తీసుకొస్తుంది. మరి ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఫ్యాక్టరీ రీసెట్‌ని ఎలా చేయాలి? ఇక్కడ తెలుసుకోండి..
ఫోన్ లో ఫ్యాక్టరీ రీసెట్ ప్రాముఖ్యత:
ఈ ఫ్యాక్టరీ రీసెట్‌తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కొత్తగా, మొదటి నుంచి ప్రారంభించడమే కాకుండా.. అనవసరమైన యాప్స్, మాల్వేర్లను నిర్మూలిస్తుంది. స్టోరేజ్ స్పేస్ కష్టాల నుంచి విముక్తం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. డివైజ్ మొత్తాన్ని రీబూట్ చేస్తుంది. అంతేకాదు.. ఈ ఫ్యాక్టరీ రీసెట్‌తో మరో ఉపయోగకం కూడా ఉంది. మీరు ఎప్పుడైనా మీ స్మార్ట్‌ఫోన్‌ని విక్రయిస్తే.. దాని నుంచి మీ డేటాను పూర్తిగా తొలగించేందుకు ఈ ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ని వాడుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లో ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలి?
స్టెప్ 1:- సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసి సిస్టెం ఆప్షన్‌లోకి వెళ్లండి.
స్టెప్ 2:- రీసెట్ ఆప్షన్ కోసం కిందకు స్క్రోల్ చేసి దానిపై ట్యాప్ చేయండి.
How to factory reset samsung phone : స్టెప్ 3:- "ఎరేజ్ ఆల్ డేటా" లేదా "ఫ్యాక్టరీ రీసెట్" ఎంచుకోండి.
స్టెప్ 4:- అవసరమైతే మీ డివైజ్ పిన్ ఎంటర్ చేయండి.
స్టెప్ 5:- ఫ్యాక్టరీ రీసెట్‌ని ధ్రువీకరించండి. రీసెట్ ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతించండి.
ఇదీ చూడండి:- Realme smart phones: ఏప్రిల్ 24 న రియల్ మి నుంచి మరో రెండు 5 జీ స్మార్ట్ ఫోన్స్ లాంచ్
రికవరీ మోడ్ ద్వారా ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలి?
స్టెప్ 1:- మీ స్మార్ట్‌ఫోన్‌ను పవర్ ఆఫ్ చేయండి.
స్టెప్ 2:- రికవరీ మోడ్‌లోకి ప్రవేశించడానికి పవర్ -వాల్యూమ్ డౌన్ బటన్లను ఒకేసారి నొక్కి పట్టుకోండి.
Smartphone tricks and tips : స్టెప్ 3:- మీకు నచ్చిన భాషను ఎంచుకుని ధృవీకరించండి.
స్టెప్ 4:- "ఎరేజ్ డేటా" ఆప్షన్ కనుగొనండి, "ఫార్మాట్ డేటా" ఎంచుకోండి.
స్టెప్ 5:- రిక్వెస్ట్ చేస్తే వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి ధృవీకరించండి.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్యాక్టరీ రీసెట్ అనేది సింపుల్ అండ్ పవర్ఫుల్ ఆప్షన్. మీ డివైజ్ మరింత వేగంగా, పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. మీరు డీక్లూటర్, ట్రబుల్ షూట్ సాఫ్ట్వేర్ సమస్యలను పరిష్కరించాలని లేదా రీసేల్ కోసం సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఈ గైడ్‌ని అనుసరించడం వల్ల స్మూత్‌గా గ్యాడ్జెట్‌ని రీసెట్ చేసుకోవచ్చు.
అయితే.. ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు.. మీ డేటాను బ్యాకప్ చేయడం గుర్తుంచుకోండి. లేకపోతే.. మీ డేటా పోయే ప్రమాదం ఉంటుంది. మళ్లీ దానిని తిరిగి పొందడం చాలా కష్టమవుతుంది.