Apple MacBook Air : ఎం3 చిప్‌తో రెండు యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్ లాంచ్..
ఎం3 చిప్సెట్తో కూడిన కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ని లాంచ్ చేసింది యాపిల్ సంస్థ. ఇది.. రెండు మోడల్స్‌లో అందుబాటులోకి వచ్చింది. వీటి ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Apple MacBook Air M3 : యాపిల్ తన తాజా ఎం3 చిప్‌తో కూడిన రెండు కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ మోడళ్లను విడుదల చేసింది. వీటి పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుంది. రెండింటికీ డిస్ప్లై స్క్రీన్ సైజ్ వేరువేరుగా ఉన్నాయి. ఒకటి 13 ఇంచ్, ఇంకోటి 15 ఇంచ్. వీటి ప్రారంభ ధర రూ. 1,14,900గా ఉంది. టీచర్స్, స్టూడెంట్స్‌కి డిస్కౌంట్లో ఇవి.. రూ. 1,04,900- రూ. 1,24,900కి ప్రత్యేక్ సేల్ ఆఫర్స్‌లో భాగంగా ఇస్తోంది దిగ్గజ్ టెక్ సంస్థ యాపిల్.
పర్ఫార్మెన్స్.. సూపర్!
తాజా మ్యాక్‌బుక్ ఎయిర్ మెయిన్ హైలైట్లలో ఒకటి.. దాని ఆకట్టుకునే పనితీరు, ప్రదర్శన. పాత ఎం1 వెర్షెన్‌తో పోలిస్తే 60 శాతం వేగాన్ని పెంచింది! ఎం3 చిప్ అత్యంత వేగవంతమైన ఇంటెల్ ఆధారిత మ్యాక్‌బుక్ ఎయిర్ కూడా 13 ఫ్యాక్టర్‌తో అధిగమిస్తుందని ఆపిల్ ధీమాగా చెబుతోంది. అప్‌గ్రేడెడ్ న్యూరల్ ఇంజిన్‌ను చేర్చడం వల్ల ల్యాప్‌టాప్ సామర్థ్యంతో పాటు వేగాన్ని మరింత పెంచగలిగింది యాపిల్. ఇది "AI పై అధికంగా వర్క్ చేసే వారికి ది బెస్ట్ ల్యాప్‌టాప్‌గా ఉంటుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
మ్యాక్‌బుక్ ఎయిర్ రెండూ 18 గంటల బ్యాటరీ లైఫ్‌ని అందిస్తాయి. డ్యూయెల్ ఎక్స్టర్నల్ డిస్ప్లేలను సపోర్ట్ చేస్తాయి.
Apple MacBook Air M3 price : ఎం3తో కూడిన కొత్త యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ కొనుగోలు చేయాలనుకునే ఆసక్తిగల కొనుగోలుదారులు.. మార్చి 4 నుంచి ఆపిల్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా తమ ఆర్డర్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ మార్చ్ 8 నుంచి ఆపిల్ స్టోర్ లొకేషన్లు, ఆపిల్ అధీకృత రీసెల్లర్లలో లభ్యం అవుతుంది.
కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజం ఏవీ 1 డీకోడ్ ఇంజిన్‌ను కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. స్ట్రీమింగ్ సేవల కోసం వినియోగదారులకు మెరుగైన వీడియో నాణ్యత, సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇవి. వైఫై 6-ఈ సపోర్ట్‌తో పాటు వాయిస్ ఐసోలేషన్, వైడ్ స్పెక్ట్రమ్ మైక్రోఫోన్ మోడ్స్, ఆడియో, వీడియో కాల్స్ సమయంలో మెరుగైన వాయిస్ క్లారిటీ వంటి అధునాతన ఫీచర్లను ఈ ల్యాప్‌టాప్ లాంచ్ అయ్యింది.
Apple MacBook Air M3 price in India : ఎం3 16-కోర్ న్యూరల్ ఇంజిన్ కెమెరా ఫీచర్లను ఎనేబుల్ చేయడం, టెక్స్ట్ కు రియల్ టైమ్ స్పీచ్, అనువాదం, టెక్స్ట్ అంచనాలు దృశ్య అవగాహన వంటి కొన్ని మాక్ఓఎస్ ఫంక్షనాలిటీతో సహా నిర్దిష్ట ఏఐ మోడళ్ల కోసం ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్‌ని ఆప్టిమైజ్ చేశారు.
సంబంధిత కథనం