Apple scary fast event : కొత్త ఐమ్యాక్​, మ్యాక్​బుక్​ ప్రోను లాంచ్​ చేసిన యాపిల్​-apple unveils new laptops imac and trio of more powerful chips ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Apple Unveils New Laptops, Imac And Trio Of More Powerful Chips

Apple scary fast event : కొత్త ఐమ్యాక్​, మ్యాక్​బుక్​ ప్రోను లాంచ్​ చేసిన యాపిల్​

Sharath Chitturi HT Telugu
Oct 31, 2023 08:45 AM IST

Apple scary fast event : యాపిల్​ లవర్స్​కు క్రేజీ న్యూస్​. సరికొత్త ఐమ్యాక్​, మ్యాక్​బుక్​ ప్రో మోడల్స్​ను సంస్థ లాంచ్​ చేసింది. ఆ వివరాలు..

కొత్త ఐమ్యాక్​, ల్యాప్​టాప్స్​ని లాంచ్​ చేసిన యాపిల్​
కొత్త ఐమ్యాక్​, ల్యాప్​టాప్స్​ని లాంచ్​ చేసిన యాపిల్​ (REUTERS)

Apple new launches : అమెరికా కాలిఫోర్నియా వేదికగా జరిగిన 'స్కేరీ ఫాస్ట్​' ఈవెంట్​లో పలు ఎగ్జైటింగ్​ మోడల్స్​ని లాంచ్​ చేసింది దిగ్గజ టెక్​ సంస్థ యాపిల్​. సరికొత్త ఐమ్యాక్​తో పాటు ల్యాప్​టాప్స్​ని సైతం ఆవిష్కరించింది. ఆ వివరాలు..

ట్రెండింగ్ వార్తలు

యాపిల్​ ఎం3 చిప్​..

సరికొత్త యాపిల్​ ఎం3 చిప్​సెట్స్​లో 16 కోర్​ న్యూరల్​ ఇంజిన్, హార్డ్​వేర్ యాక్సలరేటెడ్​ మెష్​ షేడింగ్​, డైనమిక్​ కాచింగ్​, హార్డ్​వేర్​ యాక్సలరేటెడ్​ రే ట్రేసింగ్​, అడ్వాన్స్​డ్​ మీడియా ఇంజిన్​ వంటివి​​ ఉంటాయి. బేస్​ వర్షెన్​లో 8 కోర్​ సీపీయూ, 10 కోర్​ జీపీయూ, 24జీబీ మెమోరీ వంటివి లభిస్తాయి. ఇక ఎం3 ప్రో వేరియంట్​లో 12 కోర్​ సీపీయూ, 18 కోర్​ జీపీయూ, 36జీబీ ర్యామ్​ వంటివి ఉంటాయి. ఎం3 మ్యాక్స్​లో 16 కోర్​ సీపీయూ, 40 కోర్​ జీపీయూ, 128జీబీ మెమోరీ లభిస్తాయి.

సరికొత్త మ్యాక్​బుక్​..

Apple new MacBook pro : స్కేరీ ఫాస్ట్​ ఈవెంట్​లో.. 14 ఇంచ్​, 16 ఇంచ్​ మ్యాక్​బుక్​ ప్రో మోడల్స్​ను ఆవిష్కరించింది యాపిల్​. వీటిల్లో ఎం3 ప్రో, ఎం3 మ్యాక్స్​ చిప్​సెట్స్​ ఉన్నాయి.

ల్యాప్​టాప్స్​లో మినీ ఎల్​ఈడీ డిస్​ప్లే, 1080పీ కెమెరా, 6 స్పీకర్​ ఆడియో, 22 గంటల బ్యాటరీ లైఫ్​, 128జీబీ ర్యామ్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

New MacBook pro price : ఫింగర్​ప్రింట్​ రెసిస్టెన్స్​ వీటి సొంతం. 14 ఇంచ్​ మ్యాక్​బుక్​ ప్రో ధర 1,999 డాలర్లు. 16 ఇంచ్​ మ్యాక్​బుక్​ ప్రో ధర 2,499 డాలర్లు.

అయితే.. బేస్​ ఎం3 చిప్​సెట్​తో కూడా 14 ఇంచ్​ మ్యాక్​బుక్​ ప్రో మోడల్​ను కూడా లాంచ్​ చేసింది యాపిల్ సంస్థ​. దీని ధర 1,599 డాలర్లు. ఇందులో 8జీబీ ర్యామ్​ ఉంటుంది.

కొత్త ఐమ్యాక్​..

New iMac launched : 24 ఇంచ్​ ఐమ్యాక్​ని కూడా ఈ ఈవెంట్​లో లాంచ్​ చేసింది యాపిల్​ సంస్థ. ఇందులో ఎం3 చిప్​సెట్​ ఉంటుంది. ఫలితంగా ప్రదర్శన రెట్టింపు అవుతుంది. ఈ అప్డేటెడ్​ ఐమ్యాక్​లో 4.5కే రెటీనా డిస్​ప్లే ఉంటుంది. వైఫై 6ఈ, 1080పీ వెబ్​క్యామ్​ వంటివి ఉంటాయి. 24జీబీ మెమోరీ లభిస్తోంది. 7 కలర్స్​లో ఇది అందుబాటులోకి వచ్చింది.

ఐమ్యాక్​ 8 కోర్​ సీపీయూ ధర 1,299 డాలర్లు. 10- కోర్​ సీపీయూ ఐమ్యాక్​ ధర 1499 డాలర్లు.

WhatsApp channel

సంబంధిత కథనం