Apple iPads : యాపిల్​ లవర్స్​కు క్రేజీ న్యూస్​.. 3 కొత్త ఐప్యాడ్స్​ లాంచ్​ రేపే!-apple could launch 3 new ipads tomorrow know whats coming ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Apple Ipads : యాపిల్​ లవర్స్​కు క్రేజీ న్యూస్​.. 3 కొత్త ఐప్యాడ్స్​ లాంచ్​ రేపే!

Apple iPads : యాపిల్​ లవర్స్​కు క్రేజీ న్యూస్​.. 3 కొత్త ఐప్యాడ్స్​ లాంచ్​ రేపే!

Sharath Chitturi HT Telugu
Oct 16, 2023 01:40 PM IST

Apple iPads launch : యాపిల్​ సంస్థ నుంచి 3 కొత్త ఐప్యాడ్స్​ లాంచ్​కు సిద్ధమవుతున్నాయి. మంగళవారమే ఇవి లాంచ్​ అవుతాయని టాక్​ నడుస్తోంది.

3 కొత్త ఐప్యాడ్స్​- రేపే లాంచ్​
3 కొత్త ఐప్యాడ్స్​- రేపే లాంచ్​ (Unsplash)

Apple iPads : యాపిల్​ లవర్స్​కు మంచి కిక్​ ఇచ్చే వార్త! మూడు కొత్త ఐప్యాడ్​ డివైజ్​లను.. యాపిల్​ సంస్థ ఈ వారంలో లాంచ్​ చేస్తుందని నివేదికలు సూచిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. మంగళవారమే ఈ గ్యాడ్జెట్స్​ లాంచ్​ అవుతాయని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

యాపిల్​ ఐప్యాడ్స్​..

ఈ ఏడాది అనేక కొత్త ప్రాడక్ట్స్​ని లాంచ్​ చేసింది యాపిల్​ సంస్థ. ఐఫోన్​ 15 సిరీస్​తో పాటు ఇతర వాటికి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. అయితే.. ఇప్పటివరకు ఒక్క ఐప్యాడ్​ కూడా లాంచ్​ అవ్వలేదు. ఐప్యాడ్​​ 13ఏళ్ల చరిత్రలో.. ఏడాదిలో ఒక్క ప్రాడక్ట్​ కూడా బయటకు రాకుండా లేదు! ఇక ఇప్పుడు.. ఏకంగా మూడు డివైజ్​లు రేపు లాంచ్​ అవుతాయని వార్తలు వస్తున్నాయి.

Apple iPads launch date : ఈసారి లాంచ్​ అయ్యే గ్యాడ్జెట్స్​లో ఐప్యాడ్​ మినీ, ఐప్యాడ్​ ఎయిర్​ (ఎం2 అప్​గ్రేడ్​) కూడా ఉంటాయని సమాచారం. 2022 అక్టోబర్​లో ఎం2 పవర్డ్​ ఐప్యాడ్​ ప్రోతో పాటు 10వ జెనరేషన్​ ఐప్యాడ్​ని సైతం లాంచ్​ చేసింది. ఈసారి.. ఐప్యాడ్​ మినీ, ఐప్యాడ్​ ఎయిర్​, ఐప్యాడ్​ 11వ జెనరేషన్​ లాంచ్​ అవుతాయని పలు లీక్స్​ సూచిస్తున్నాయి.

ఈ మూడు ఐప్యాడ్స్​ ఫీచర్స్​కి సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కాకపోతే ప్రాసెసర్​లో కచ్చితంగా అప్​గ్రేడ్స్​ ఉంటాయని తెలుస్తోంది. ఎం3 ఎస్​ఓసీ చిప్​సెట్​ని సంస్థ డెవలప్​చేస్తున్నప్పటికీ.. ఇప్పుడు వస్తున్న గ్యాడ్జెట్స్​లో అది ఉండకపోవచ్చు. ఐప్యాడ్​ ఎయిర్​లో ఎం2 అప్​గ్రేడ్​, ఐప్యాడ్​ మినీలో ఏ16 ఎస్​ఓసీ ఉండొచ్చు. ఐఫోన్​ 15, ఐఫోన్​ 15 ప్లస్​లో ఇవే ఉన్నాయి.

Apple iPad mini launch in India : వండర్​లస్ట్​ పేరుతో ఓ భారీ ఈవెంట్​ను ఏర్పాటు చేసి.. ఐఫోన్​ మొబైల్స్​ను లాంచ్​ చేయడం యాపిల్​కు ఆనవాయతీగా వస్తోంది. కానీ ఐప్యాడ్​ లాంచ్​కు అంత హంగామా ఉండకపోవచ్చు. ఒక సాధారణ ప్రెస్​ రిలీజ్​, ప్రకటన వీడియోతో ఇవి మార్కెట్​లోకి లాంచ్​ అయ్యే అవకాశాలే ఎక్కువ అని సమాచారం.

అయితే ప్రస్తుతం ఇవి రూమర్స్​ మాత్రమే. సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రేపు ఈ గ్యాడ్జెట్స్​ నిజంగా లాంచ్​ అయితే.. ఇక యాపిల్​ లవర్స్​కు పండగే!

సంబంధిత కథనం