Apple iPad Air 6 : క్రేజీ ఫీచర్స్​తో యాపిల్​ ఐప్యాడ్​ ఎయిర్​ 6.. లాంచ్​ ఎప్పుడంటే!-apple ipad air 6 leak from magic keyboard to size know what has been revealed ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Apple Ipad Air 6 : క్రేజీ ఫీచర్స్​తో యాపిల్​ ఐప్యాడ్​ ఎయిర్​ 6.. లాంచ్​ ఎప్పుడంటే!

Apple iPad Air 6 : క్రేజీ ఫీచర్స్​తో యాపిల్​ ఐప్యాడ్​ ఎయిర్​ 6.. లాంచ్​ ఎప్పుడంటే!

Sharath Chitturi HT Telugu
Oct 10, 2023 06:04 AM IST

Apple iPad Air 6 : యాపిల్​ ఐప్యాడ్​ ఎయిర్​ 6కి సంబంధించిన అనేక రూమర్స్​ ఆన్​లైన్​లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాము..

యాపిల్​ ఐప్యాడ్​ ఎయిర్​ 6..
యాపిల్​ ఐప్యాడ్​ ఎయిర్​ 6.. (HT Tech)

Apple iPad Air 6 : ఐఫోన్​ 15 సిరీస్​ లాంచ్​తో ఈ ఏడాది భారీ హిట్​ కొట్టింది యాపిల్​ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ సంస్థ నుంచి భవిష్యత్తులో రానున్న ప్రాడక్ట్స్​పై మరింత ఉత్కంఠ పెరిగింది. వీటిల్లో యాపిల్​ ఐప్యాడ్​ ఎయిర్​ 6 ఒకటి. ఈ గ్యాడ్జెట్​పై ఇప్పటికే అనేక లీక్స్​ బయటకి వచ్చాయి. తాజాగా మరో క్రేజీ ఆప్డేట్​ ఆన్​లైన్​లో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

యాపిల్​ ఐప్యాడ్​ ఎయిర్​ 6..

రూమర్స్​ ప్రకారం.. యాపిల్​ సంస్థ వచ్చే ఏడాదిలో నాలుగు ఐప్యాడ్​ మోడల్స్​ని లాంచ్​ చేస్తుంది. వైఫై, సెల్యులర్​+ వైఫై వర్షెన్​లు వీటిల్లో ఉంటాయి. ఇక ఐప్యాడ్​ ఎయిర్​ 6 సైజు కూడా భారీగానే ఉంటుంది! అనేక అడ్వాన్స్​డ్​ ఫీచర్స్​ ఇందులో ఉంటాయి. ప్రస్తుతానికైతే.. రెండు ఐప్యాడ్​ ఎయిర్​ ప్రాడక్ట్స్​లకు జే537, జే538 అన్న కోడ్​ నేమ్​ని పెట్టింది యాపిల్​ సంస్థ.

ఇతర లీక్స్​ ప్రకారం.. ఈ ఐప్యాడ్​లో సరికొత్త మ్యాజిక్​ కీబోర్డ్​ ఉంటుంది. యాక్సెలరోమీటర్​ సహా రెండు సెన్సార్​లు ఇందులో ఉంటాయి. ఈ కీబోర్డ్​ కోడ్​ నేమ్​ ఆర్​219.

Apple iPad Air 6th generation : 2024 జూన్​లో జరిగే డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్​లో.. ఈ యాపిల్​ ఐప్యాడ్​ ఎయిర్​ 6 లాంచ్​ అవ్వొచ్చు. అయితే ఇవి ప్రస్తుతానికి రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. వీటిపై సంస్థ ఇంకా స్పందించలేదు. లాంచ్​కి కూడా సమయం ఉండటంతో.. రానున్న రోజుల్లో ఈ గ్యాడ్జెట్​కు సంబంధించి.. మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఐప్యాడ్​ మినీ 7..

ఐప్యాన్​ మినీ 7 గ్యాడ్జెట్​ కూడా రానున్న నెలల్లో మార్కెట్​లో లాంచ్​ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులోని న్యూ మినీ జనరేషన్​తో.. ప్రాసెసర్​ అప్డేట్​ అవుతుందని సమాచారం. ఇదే నిజమైతే.. ఈ మోడల్​కు డిమాండ్​ మరింత పెరుగుతుందని టెక్​ వర్గాలు భావిస్తున్నాయి.

యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రో 2..

Apple iPad Air 6 release date : ఇండియాలో ఫెస్టివల్​ సీజన్​తో పాటు ఆఫర్స్​, డిస్కౌంట్స్​ హడావుడి కూడా మొదలైంది. దిగ్గజ ఈ-కామర్స్​ సంస్థలు అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లు.. పలు ప్రాడక్ట్స్​పై పొటీపడి మరీ క్రేజీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రో సెకెండ్​ జెన్​పై మంచి ఆఫర్స్​ కనిపిస్తున్నాయి. యాపిల్​ వెబ్​సైట్​లో ఎయిర్​పాడ్స్​ ప్రో 2 ధర రూ. 24,900గా ఉంది. కాగా.. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లో మాత్రం ఈ గ్యాడ్జెట్​ను ఆఫర్​లో రూ. 18,499కే కొనుగోలు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం