ఆపిల్ కంపెనీ తాజాగా 2022 సిరీస్ ఐప్యాడ్ ప్రోను లాంచ్ చేసింది. దీనిని శక్తివంతమైన M2 చిప్‌తో అందిస్తున్నారు. ఇది యాపిల్ పెన్సిల్ హోవర్ ఎక్స్పీరియన్స్, వైఫై 6ఇ కనెక్టివిటీ, మెరుగైన డిస్‌ప్లే, ఫేస్ ఐడి, థండర్‌బోల్ట్, నాలుగు-స్పీకర్ల ఆడియో సిస్టమ్ వంటి మెరుగైన స్పెసిఫికేషన్లతో వచ్చింది. iPadOS 16 ద్వారా పనిచేస్తుంది. ఇందులో స్టేజ్ మేనేజర్, ఫుల్ ఎక్స్టర్నల్ డిస్‌ప్లే సపోర్ట్, డెస్క్‌టాప్-క్లాస్ యాప్, రిఫరెన్స్ మోడ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
ఈ సరికొత్త iPad Pro 2022 స్క్రీన్ సైజ్ ఆధారంగా 11-అంగుళాలు, అలాగే 12-అంగుళాల వేరియంట్లలో లభిస్తుంది. అలాగే 128GB, 256GB, 512GB, 1TB ఇంకా 2TB కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులో ఉంటుంది.
ధరల విషయానికి వస్తే, 11-అంగుళాల ఐప్యాడ్ ప్రో Wi-Fi మోడల్‌కు రూ. 81,900 కాగా, Wi-Fi + సెల్యులార్ మోడల్‌కు రూ. 96,900 నుండి ప్రారంభమవుతుంది. అదేవిధంగా 12.9-అంగుళాల iPad Pro Wi-Fi మోడల్‌కు రూ. 1,12,900 కాగా, Wi-Fi + సెల్యులార్ మోడల్‌కు రూ. 1,27,900 నుండి ధరలు ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్ 26, 2022 నుండి స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా Apple iPad (10th generation) ను కూడా ఆపిల్ కంపెనీ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఆ వివరాలు ఈ కింద చూడండి.
పూర్తిగా నవీకరించిన డిజైన్‌తో, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లతో Apple iPad (10th generation) ను ఆపిల్ కంపెనీ భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఇది A14 బయోనిక్ చిప్‌తో శక్తిని పొందుతుంది. ఇది సరసమైన ఐప్యాడ్‌గా పేరుగాంచిన బేస్-లెవల్ 9వ తరం ఐప్యాడ్‌కు సక్సెసర్ గా ఉంటుంది. దీని ధరలు రూ. 44 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.
కొత్త Apple iPad (10వ తరం) 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 44,900, WiFi వేరియంట్‌ల కోసం రూ. 59,900 (256GB), WiFi+సెల్యులార్ (64GB) వేరియంట్ ధర రూ. 59,900 గా ఉండగా, (256GB) వేరియంట్ ధర రూ. 74,900 గా ఉంది.
iPad 10వ తరం ఐప్యాడ్ ప్రీ-ఆర్డర్‌లు అక్టోబర్ 18 నుండి ప్రారంభమయింది. అక్టోబర్ 28 నుండి విక్రయాలు ప్రారంభమవుతున్నాయి.
సంబంధిత కథనం