తెలుగు న్యూస్ / ఫోటో /
Apple Far Out Event। ఐఫోన్ 14 సహా మరెన్నో ఆపిల్ ఉత్పత్తులు లాంచ్, పూర్తి రౌండప్!
- టెక్నాలజీ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన Apple ఈవెంట్ 'ఫార్ అవుట్' బుధవారం జరిగింది. ఇందులో భాగంగా లేటెస్ట్ iPhone 14 మోడళ్లతో పాటు, ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లు, AirPodలతో సహా కొత్త గాడ్జెట్‌లను పుష్కలంగా తీసుకువచ్చింది. ఈ ఈవెంట్‌ను మరోసారి ఇక్కడ రౌండప్ చేద్దాం..
- టెక్నాలజీ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన Apple ఈవెంట్ 'ఫార్ అవుట్' బుధవారం జరిగింది. ఇందులో భాగంగా లేటెస్ట్ iPhone 14 మోడళ్లతో పాటు, ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లు, AirPodలతో సహా కొత్త గాడ్జెట్‌లను పుష్కలంగా తీసుకువచ్చింది. ఈ ఈవెంట్‌ను మరోసారి ఇక్కడ రౌండప్ చేద్దాం..
(1 / 13)
Apple కంపెనీ తాజా లైనప్ iPhoneలు మెరుగైన కెమెరాలు, వేగవంతమైన ప్రాసెసర్‌లు, ఎక్కువ కాలం ఉండే బ్యాటరీతో వచ్చాయి. అయితే ఇవన్నీ గత సంవత్సరం మోడల్‌ల ధరలకే లభిస్తుండటం విశేషం.(Apple)
(2 / 13)
ఐఫోన్ 14 మోడల్ 6.1-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది. దీని ధర రూ. 79,900/-, అలాగే ఐఫోన్ 14 ప్లస్ ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది. దీని ధర రూ. 89,900 నుంచి ప్రారంభమవుతాయి. ఈ రెండు ఫోన్‌లలో ఐఫోన్ 13 సిరీస్‌లో ఉన్నట్లుగానే పాత A15 బయోనిక్ చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తాయి.(Apple)
(3 / 13)
మరో రెండు ఐఫోన్ మోడల్స్ అయినటువంటి ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ చాలా ఖరీదైనవి. ఐఫోన్ 14 ప్రో ధర, రూ. 1,29,900 కాగా, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ రూ. 1,39,900/- ధరకి లభిస్తుంది. వీటిలోనూ 128GB, 256GB, 512GB , 1TB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. అలాగే డీప్ పర్పుల్, సిల్వర్, గోల్డ్, స్పేస్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.(AFP)
(4 / 13)
కొత్తగా పరిచయం అయిన రెండు ఐఫోన్ 14 ప్రో మోడల్‌లు, అలాగే ఐఫోన్ 14 సెప్టెంబర్ 9 నుండి ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 16 నుండి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇక, ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 9 నుండి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.(Apple)
(5 / 13)
iPhone 14 Pro, iPhone 14 Pro Max లలో ఫేసియల్ ID, సెల్ఫీ కెమెరా ఇప్పుడు ఒక ఎడ్జ్ లో కాకుండా డిస్‌ప్లేలోకి వచ్చి చేరాయి. దీనిని 'డైనమిక్ ఐలాండ్' అనే డిజైన్‌గా చెబుతున్నారు.(AFP)
(7 / 13)
సరికొత్త ఆపిల్ స్మార్ట్ వాచ్‌లు కొత్త ఫీచర్లు, స్పెక్స్ కంటే కూడా భద్రతా అప్‌గ్రేడ్‌లతో వచ్చాయి.(Apple)
(8 / 13)
ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఐఫోన్ 14 లలో ఇచ్చిన క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌తో పాటు మహిళలు వారి అండోత్సర్గము చక్రాలను ట్రాక్ చేయవచ్చు.(Apple)
(9 / 13)
ఆపిల్ వాచ్ సిరీస్ 8, శరీర ఉష్ణోగ్రతలో మార్పులను ట్రాక్ చేయగలదని ఆపిల్ తెలిపింది, ఇది యూజర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే పని చేస్తుందని కంపెనీ తెలిపింది.(Apple)
(10 / 13)
వాచ్ సిరీస్ 8తో పాటు, ఆపిల్ తమ బ్రాండ్ నుంచి కఠినమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌వాచ్, ఆపిల్ వాచ్ అల్ట్రాను విడుదల చేసింది. ఇది సరికొత్త వాచ్ మోడల్.(AFP)
(11 / 13)
ఆపిల్ వాచ్ సిరీస్ 8 ధరలు రూ. 45,900 నుండి ప్రారంభమవుతుండగా , ఆపిల్ వాచ్ SE 2 ధర రూ. 29,900. అన్నింటికంటే ఖరీదైనది సరికొత్త ఆపిల్ వాచ్ అల్ట్రా ధర, రూ.89,900.(Apple)
(12 / 13)
ఆపిల్ వాచ్ SE రెండేళ్ల క్రితం విడుదలైంది. ఇది ఆపిల్ బ్రాండ్ నుంచి సరసమైన ధరలో లభించే అద్భుతమైన గాడ్జెట్. ఇందులో రెటినా OLED డిస్ప్లే, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ SOS వంటి ఫీచర్లు ఉన్నాయి. 50 మీటర్ల లోతు వరకు నీటి నిరోధకతను కలిగి ఉంటుంది.(AFP)
ఇతర గ్యాలరీలు