Apple Vision Pro : యాపిల్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​- విజన్​ ప్రో వచ్చేస్తోంది!-apple vision pro likely to launch next month says reports ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Apple Vision Pro : యాపిల్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​- విజన్​ ప్రో వచ్చేస్తోంది!

Apple Vision Pro : యాపిల్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​- విజన్​ ప్రో వచ్చేస్తోంది!

Sharath Chitturi HT Telugu
Jan 08, 2024 11:50 AM IST

Apple Vision Pro : యాపిల్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​! యాపిల్​ విజన్​ ప్రో రియాల్టీ హెడ్​సెట్​ లాంచ్​కు సిద్దమవుతోంది. ఆ వివరాలు..

యాపిల్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​- విజన్​ ప్రో వచ్చేస్తోంది!
యాపిల్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​- విజన్​ ప్రో వచ్చేస్తోంది!

Apple Vision Pro : వర్చ్యువల్​ రియాల్టీ హెడ్​సెట్​ ‘విజన్​ ప్రో’ లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది యాపిల్​ సంస్థ! ఈ వర్చ్యువల్​ రియాల్టీ హెడ్​సెట్​.. ఫిబ్రవరిలో లాంచ్​ అవుతుందని పలు నివేదికలు సూచిస్తున్నారు. యాపిల్​ విజన్​ ప్రో యూనిట్స్​ ఇప్పటికే అమెరికాలోని డిస్ట్రిబ్యూషన్​ సెంటర్స్​కి చేరుకున్నాయట. లాంచ్​ తర్వాత.. ఈ విజన్​ ప్రో వర్చ్యువల్​ రియాల్టీ హెడ్​సెట్స్.. యాపిల్​ రీటైల్​ స్టోర్స్​కి చేరుకుంటాయని తెలుస్తోంది.

యాపిల్​ విజన్​ ప్రో వచ్చేస్తోంది..

యాపిల్​ విజన్​ ప్రో లాంచ్​ కోసం యాపిల్​ వేగంగా ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం. లాంచ్​ డేట్​కి సంబంధించిన వివరాలు అతి త్వరలోనే బయటకి వస్తాయని తెలుస్తోంది. ఈ హెడ్​సెట్​ సేల్స్​ కోసం తమ రీటైల్​ ఉద్యోగులకు యాపిల్​ ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తోందట. ప్రతి రీటైల్​ స్టోర్​ నుంచి ముగ్గురు, నలుగురిని ఎంపిక చేసి, వారికి యాపిల్​ సంస్థ శిక్షణ ఇస్తోంది. అనంతరం.. వారు, తమ స్టోర్స్​కి వెళ్లి ఇతరులకు ట్రైనింగ్​ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా.. జనవరి 21 నుంచి ఎక్స్​ట్రా సెషన్స్​ని కూడా నిర్వహించే యోచనలో యాపిల్​ సంస్థ ఉందని సమాచారం.

Apple Vision Pro release date : ఇవన్నీ చూస్తుంటే.. ఈ యాపిల్​ విజన్​ ప్రో కచ్చితంగా ఫిబ్రవరిలోనే లాంచ్​ అవుతుందన్న మాటలకు బలం చేకూరుతోంది.

ఇదీ చూడండి:- OnePlus Ace 3 : వన్​ప్లస్​ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​.. ఏస్​ 3 ఫీచర్స్​ చూశారా?

యాపిల్​ విజన్​ ప్రో విశేషాలు..

డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023లో తొలిసారిగా విజన్​ ప్రోని ప్రపంచానికి పరిచయం చేసింది యాపిల్​ సంస్థ. ఈ రియాల్టీ హెడ్​సెట్​లో ఎం2 చిప్​సెట్​, రెండు హై- రిసొల్యూషన్​ 4కే ఐపీస్​లు ఉంటాయి. ఇందులో ఎక్స్​టర్నల్​ బ్యాటరీ ప్యాక్​ కూడా ఉంటుంది. ఈ హెడ్​సెట్​తో వర్చ్యువల్​ రియాల్టీ అనుభూతిని పొందవచ్చు.

Apple Vision Pro launch in India : ప్రస్తుతానికైతే ఈ విజన్​ ప్రో.. అమెరికాలో మాత్రమే అందుబాటులోకి రానుంది. దీని ప్రారంభ ధర 3,499 డాలర్లు. అంటే సుమారు రూ. 2.91లక్షలు. ఇండియాలో లాంచ్​పై సంస్థ ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

అయితే.. ఇతర దేశాలకు కూడా ఈ యాపిల్​ విజన్​ ప్రోని తీసుకెళ్లాలని సంస్థ ప్లాన్​ చేస్తోంది. లిస్ట్​లో చైనా, కెనడా, యూకే వంటి దేశాలు ఉన్నాయి. మరి ఇండియా లాంచ్​పై అప్డేట్​ కోసం వేచి చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం