Moto G34 5G : ఇండియాలో మోటో జీ34 5జీ లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ధర ఎంతంటే..!-moto g34 5g launch date in india fixed check price and features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Moto G34 5g : ఇండియాలో మోటో జీ34 5జీ లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ధర ఎంతంటే..!

Moto G34 5G : ఇండియాలో మోటో జీ34 5జీ లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ధర ఎంతంటే..!

Sharath Chitturi HT Telugu
Jan 06, 2024 08:10 AM IST

Moto G34 5G expected price in India : ఇండియాలో మోటో జీ34 5జీ లాంచ్​ డేట్​ ఫిక్స్ అయ్యింది. ఫీచర్స్​, ధర వివరాలు ఇవే..

ఇండియాలో మోటో జీ34 5జీ లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ధర ఎంతంటే..!
ఇండియాలో మోటో జీ34 5జీ లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ధర ఎంతంటే..!

Moto G34 5G expected price in India : ఇండియాలోకి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేయనుంది మోటోరోలా సంస్థ. దీని పేరు మోటో జీ34. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. ఈ మోటో జీ34 5జీ.. ఇండియాలో జనవరి 9న లాంచ్​ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మోటో జీ34 ఫీచర్స్​ ఇవే..

ఈ మోటో కొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ఇటీవలే చైనాలో లాంచ్​ అయ్యింది. ఇండియాలో లాంచ్​ అయ్యే గ్యాడ్జెట్​ ఫీచర్స్​, చైనా మోడల్​కి పోలి ఉంటాయి. మోటో జీ34లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 695 ప్రాసెసర్​ ఉంటుంది. 8జీబీ ర్యామ్​- 124జీబీ స్టోరేజ్​ సెటప్​ లభిస్తోంది. ఈ ఫోన్​కి 8జీబీ వర్చ్యువల్​ ర్యామ్​- మైక్రో ఎస్​డీ కార్డ్​ స్లాట్​ కూడా లభిస్తుండటం విశేషం.

Moto G34 5G price : ఇక మోటో జీ34 5జీ గ్యాడ్జెట్​లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.5 ఇంచ్​ హెచ్​డీ+ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. పంచ్​ హోల్​ కటౌట్​ డిజైన్​ వస్తోంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు 18 వాట్​ ఛార్జర్​ ఇందులో ఉంటుంది.

మోటోరోలా కొత్త గ్యాడ్జెట్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ మాక్రో లెన్స్​ సెటప్​ వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది. ఆడ్రాయిడ్​ 14 ఆధారిత ఎంవైయూఐ 6.0 సాఫ్ట్​వేర్​పై ఇది​ పనిచేస్తుంది. ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో డాల్బీ అట్మోస్​ సపోర్ట్​ కూడా ఉంది.

మోటో జీ34 5జీ ధర ఎంతంటే..

Moto G34 5G expected price : ఇక మోటో జీ34 స్మార్ట్​ఫోన్​లో స్టార్​ బ్లాక్​, సీ బ్లూ కలర్​ ఆప్షన్స్​ లభిస్తున్నాయి. చైనాలో ఈ మొబైల్​ ధర 999 యువాన్​లుగా ఉంది. ఇండియన్​ కరెన్సీలో అది సుమారు రూ. 12వేలు. అయితే.. ఇండియాలో.. 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 10,999గా ఉండొచ్చు. 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీటిపై బ్యాంక్​ ఆఫర్స్​ కూడా ఉంటాయి. లాంచ్​ తర్వాత.. ఫ్లిప్​కార్ట్​తో పాటు మోటోరోలా ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ స్టోర్స్​లో ఈ మొబైల్​ అందుబాటులో ఉండనుంది.

ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఈ మోటోరోలా కొత్త గ్యాడ్జెట్​కి మంచి డిమాండ్​ ఉంటుందని టెక్​ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి బడ్జెట్​ ఫ్రెండ్లీ సెగ్మెంట్​లో పోటీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం