12th Fail OTT: నిరీక్షణ ముగిసింది.. తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన 12th ఫెయిల్ సినిమా-12th fail movie movie telugu version streaming starts on disneyplus hotstar ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  12th Fail Ott: నిరీక్షణ ముగిసింది.. తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన 12th ఫెయిల్ సినిమా

12th Fail OTT: నిరీక్షణ ముగిసింది.. తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన 12th ఫెయిల్ సినిమా

Chatakonda Krishna Prakash HT Telugu
Published Mar 04, 2024 08:17 PM IST

12th Fail Telugu versions: 12th ఫెయిల్ సినిమా ఎట్టకేలకు తెలుగులోనూ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కోసం చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు అది వచ్చేసింది.

12th Fail Telugu: నిరీక్షణ ముగిసింది.. తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన 12th ఫెయిల్ సినిమా
12th Fail Telugu: నిరీక్షణ ముగిసింది.. తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన 12th ఫెయిల్ సినిమా

12th Fail Movie Telugu: తక్కువ బడ్జెట్‍తో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘12th ఫెయిల్’ బ్లాక్‍బస్టర్ అయింది. దర్శకుడు విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం అనేక మంది ప్రశంసలను పొందింది. సాధారణ ప్రేక్షకుల నుంచి చాలా మంది ప్రముఖులు కూడా ఈ మూవీని చాలా మెచ్చుకున్నారు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఆయన పాత్రను ఈ మూవీలో పోషించారు విక్రాంత్ మాసే. గతేడాది అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అయితే, ఓటీటీలోకి వచ్చాక 12th ఫెయిల్ సినిమా మరింత పాపులర్ అయింది. భారీ వ్యూస్‍తో దూసుకెళుతోంది.

12th ఫెయిల్ సినిమా గత డిసెంబర్ 29వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, కేవలం హిందీ వెర్షన్‍లోనే అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రం రిలీజైనా.. ఓటీటీలోకి మాత్రం హిందీ మాత్రం వచ్చింది. దీంతో 12th ఫెయిల్ తెలుగు వెర్షన్ తీసుకురావాలని హాట్‍స్టార్ ఓటీటీని చాలా మంది నెటిజన్లు డిమాండ్లు చేస్తూ వచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఆ నిరీక్షణ ముగిసింది.

తెలుగు సహా ఈ భాషల్లోనూ..

12th ఫెయిల్ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా నేడు అందుబాటులోకి వచ్చేసింది. అలాగే, తమిళం, మలయాళం, కన్నడలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఎట్టకేలకు ప్రాంతీయ భాషల ఆడియోల్లోనూ ఈ చిత్రం రావడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

12th ఫెయిల్ సినిమాలో విక్రాంత్ మాసే, మేధా శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. అనంత్ వీ జోషి, ఆయుష్మాన్ పుష్కర్, ప్రియాన్షు చెటర్జీ, గీతా అగర్వాల్ శర్మ, హరీశ్ ఖన్నా కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విధు వినోద్ చోప్రా.. నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమాకు శాంతనూ మోయిత్రా మ్యూజిక్ అందించారు.

ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శుక్లా జీవితంపై 12th ఫెయిల్ చిత్రాన్ని విధు వినోద్ చోప్రా తెరక్కించారు. అనురాగ్ పాఠక్ రచించిన పుస్తకం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. వెనుకబడిన ప్రాంతంలోని పేద కుటుంబానికి చెందిన మనోజ్ కుమార్ శర్మ.. అనేక కష్టాలను దాటి ఐపీఎస్ అధికారిగా ఎదగడాన్ని ఈ చిత్రంలో స్ఫూర్తిదాయకంగా.. ఎమోషనల్‍గా చూపించారు చోప్రా. ఓ దశలో 12వ తరగతి ఫెయిల్ అయిన మనోజ్.. తర్వాత చాలా పట్టుదలతో కష్టాలన్నీ అధిగమించి యూపీఎస్‍సీ పరీక్లలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అయ్యారు. ఈ నిజ జీవిత స్టోరీని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు విధు వినోద్ చోప్రా. మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మాసే నటనకు కూడా అనేక ప్రశంసలు దక్కాయి.

12th ఫెయిల్ చిత్రానికి ఫిల్మ్స్ ఫేర్‌ అవార్డుల పంట పండింది. 2023కు గాను ఉత్తమ చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ స్క్రీన్‍ప్లేకు గాను విధు వినోద్ చోప్రాకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. క్రిటిక్స్ కేటగిరీలో ఉత్తమ నటుడి పురస్కారం దక్కించుకున్నాడు విక్రాంత్ మాసే. బెస్ట్ ఎడిటింగ్ అవార్డు కూడా ఈ చిత్రానికి లభించింది.

Whats_app_banner