Apple iPhone 15: అమెజాన్ లో ఆపిల్ ఐఫోన్ 15 పై ఆకర్షణీయమైన డిస్కౌంట్-apple iphone 15 discount price is now live on amazon check the offer ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Apple Iphone 15: అమెజాన్ లో ఆపిల్ ఐఫోన్ 15 పై ఆకర్షణీయమైన డిస్కౌంట్

Apple iPhone 15: అమెజాన్ లో ఆపిల్ ఐఫోన్ 15 పై ఆకర్షణీయమైన డిస్కౌంట్

HT Telugu Desk HT Telugu
Apr 06, 2024 04:12 PM IST

Apple iPhone 15: ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఆమెజాన్ లో ఆపిల్ ఐఫోన్ 15 గణనీయమైన తగ్గింపు ధరకు లభిస్తోంది. ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ లపై ఆమెజాన్ లో లభిస్తున్న డిస్కౌంట్ ల వివరాలను ఇక్కడ చూడండి.

ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్
ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ (Apple)

Apple iPhone 15: అమెజాన్ లో ఆపిల్ ఐఫోన్ 15 ఇప్పుడు ఆకర్షణీయమైన తగ్గింపుతో లభిస్తోంది. ఈ ప్రీమియం, లగ్జరీ స్మార్ట్ ఫోన్ ఒరిజినల్ ధర రూ. రూ.79,900.00 కాగా, ఆమెజాన్ లో దీనిపై 9% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ అనంతరం ఐ ఫోన్ 15 ధర రూ.72,690 కి తగ్గుతుంది.

ఐఫోన్ 15 గురించి..

ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐ ఫోన్ లకు ఉన్న డిమాండ్ తెలిసిందే. ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ లను ఆపిల్ గత సంవత్సరమే మార్కెట్లోకి విడుదల చేసింది. ఐఫోన్ 15 (iPhone 15) వినూత్న ఫీచర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. ఇది మార్కెట్లో అత్యంత ప్రతిష్టాత్మక స్మార్ట్ ఫోన్లలో ఒకటిగా నిలిచింది. ఇందులో ఉన్న శక్తివంతమైన ఏ16 బయోనిక్ చిప్ శక్తిమంతమైన పనితీరును, ఆకట్టుకునే వేగాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో 2ఎక్స్ టెలిఫోటో లెన్స్ తో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఐ ఫోన్ కెమెరా క్వాలిటీని ఇది మరింత పెంచింది. ఇందులోని డైనమిక్ ఐలాండ్ ఫీచర్ వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

ఎక్స్ క్లూజివ్ ఆఫర్లు, డీల్స్

ఆమెజాన్ లో ఆపిల్ ఐ ఫోన్ 15 (iPhone 15) పై డిస్కౌంట్ తో పాటు వివిధ ఎక్స్ క్లూజివ్ ఆఫర్లు, డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అర్హత కలిగిన క్రెడిట్ కార్డు హోల్డర్లు బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ. 6,000 వరకు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. అంతేకాకుండా కస్టమర్లు సౌకర్యవంతమైన ఈఎంఐ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు, మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే రూ. 32,900 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, మీరు ఎక్స్చేంజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ మోడల్, బ్రాండ్, కండిషన్ పై ఆధారపడి ఎక్స్చేంజ్ బోనస్ మొత్తం మారుతూ ఉంటుంది.

WhatsApp channel