Credit card : క్రెడిట్​ కార్డు బిల్లులో ‘మినిమమ్ డ్యూ​ అమౌంట్​’ కడితే ఏమవుతుంది?-what happens if we pay minimum due on credit card ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Credit Card : క్రెడిట్​ కార్డు బిల్లులో ‘మినిమమ్ డ్యూ​ అమౌంట్​’ కడితే ఏమవుతుంది?

Credit card : క్రెడిట్​ కార్డు బిల్లులో ‘మినిమమ్ డ్యూ​ అమౌంట్​’ కడితే ఏమవుతుంది?

Sharath Chitturi HT Telugu
Apr 06, 2024 11:24 AM IST

Minimum due on credit card : క్రెడిట్​ కార్డు మినిమమ్​ డ్యూ అంటే ఏంటి? మినిమమ్​ డ్యూ కడితే ఏమవుతుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి..

క్రెడిట్​ కార్డు మినిమమ్​ డ్యూ అంటే ఏంటి?
క్రెడిట్​ కార్డు మినిమమ్​ డ్యూ అంటే ఏంటి?

Minimum due in credit card means : ఆర్థిక అవసరాల కోసం చాలా మంది క్రెడిట్​ కార్డులను వాడుతూ ఉంటారు. క్రెడిట్​ కార్డు అనేది ఇప్పుడు సాధారణ జీవితంలో ఒక భాగమైపోయింది. కానీ చాలా మందికి వాటిని ఎలా వాడుకోవాలో తెలియక.. ఎక్కువ వడ్డీలు చెల్లిస్తూ ఉంటారు. వాటితో పాటు.. క్రెడిట్​ కార్డుల చుట్టూ ఎన్నో సందేహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఒకటి.. క్రెడిట్​ కార్డు బిల్లులో 'మినిమమ్​ అమౌంట్​ డ్యూ'ని కడితే ఏమవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ తెలుసుకోండి.

క్రెడిట్​ కార్డు మినిమమ్​ డ్యూ..

క్రెడిట్​ కార్డు బిల్లులో 'మినిమమ్​ అమౌంట్​ డ్యూ'ని కడితే ఏమవుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు.. అసలు క్రెడిట్​ కార్డు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము. మన అవసరాలు తీర్చుకునేందుకు బ్యాంక్​ల నుంచి అప్పులు తీసుకుంటాము. అలాంటి వాటిల్లో ఒకటి క్రెడిట్​ కార్డు. డబ్బు తీసుకున్న తర్వాత.. బిల్లు జనరేట్​ అవుతుంది. ఒక టైమ్​ పీరియడ్​కి ఆ డబ్బులు తిరిగి చెల్లించాలి. లేకపోతే తీసుకున్న అప్పుపై వడ్డీ పడుతుంది.

ఇక.. డ్యూ డేట్​ సమయానికి బిల్లులో కట్టాల్సిన మినిమమ్​ అమౌంట్​ని మినిమమ్​ డ్యూ అని అంటారు. క్రెడిట్​ కార్డు సేవలను పొందాలి అంటే.. కనీస అమౌంట్​ని కచ్చితంగా కట్టాలి. ఔట్​స్టాండింగ్​ క్రెడిట్​ కార్డు బిల్లు పేమెంట్​ అమౌంట్​లో ఈ మినిమిమ్​ డ్యూ.. 5శాతం నుంచి 10శాతం మధ్యలో ఉంటుంది.

Minimum due in credit card charges : ఉదాహరణకు.. మీ క్రెడిట్​ కార్డు ఔట్​స్టాండింగ్​ బ్యాలెన్స్​ రూ. 20వేలు అనుకుందాము. దాని మీక 5శాతం మినిమమ్​ డ్యూ పర్సెంటేజ్​ పడితే.. మీరు కట్టాల్సిన మినిమమ్​ అమౌంట్​ రూ. 1000 అవుతుంది (రూ. 20,000 x 0.05).

ఇదీ చూడండి:- Earn money with credit cards : క్రెడిట్​ కార్డులతో కూడా డబ్బులు సంపాదించొచ్చు! ఇలా చేయండి..

ఇక క్రెడిట్​ కార్డు బిల్లులో మినిమమ్​ అమౌంట్​ని మాత్రమే కడిత.. మిగిలిన బ్యాలెన్స్​ తదుపరి బిల్లింగ్​ సైకిల్​కి ఫార్వర్డ్​ అవుతుంది. దీనిపైనా వడ్డీ పడుతుంది. ఈ వడ్డీకి తోడు.. నెక్ట్స్​ బిల్లింగ్​ సైకిల్​లో మీరు తీసుకునే అప్పు పైనా వడ్డీ పడుతుంది. క్రెడిట్​ కార్డు బిల్లులను మీరు కంట్రోల్​ చేయకపోతే.. మీ మీద ఆర్థిక భారం పెరిగిపోతుంది. సాధారణ రుణాల కన్నా.. క్రెడిట్​ కార్డులపై వడ్డీలు చాలా ఎక్కువగా ఉంటాయి.

సమయానికి బిల్లులు కట్టేస్తే.. ఈ అధిక వడ్డీ భారం నుంచి తప్పించుకోవచ్చు. క్రెడిట్​ కార్డ్​ ట్రాప్​లో పడకుండా, ఆర్థికంగా ప్రశాంతంగా ఉండొచ్చు.

How credit card works : క్రెడిట్​ కార్డు మినిమమ్​ డ్యూ అమౌంట్​ని అర్థం చేసుకోవాలంటే.. బిల్లింగ్​ సైకల్​ని అర్థం చేసుకోవాలి. సాధారణంగా.. ఈ బిల్లింగ్​ సైకిల్​ 30 రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో.. క్రెడిట్​ కార్డుపై మీరు చేసే ఖర్చులు రికార్డ్​ అవుతాయి. సైకిల్​ చివర్లో మీకు స్టేట్​మెంట్​ జనరేట్​ అవుతుంది. ఈ స్టేట్​మెంట్​లో ఔట్​స్టాండింగ్​ బ్యాలెన్స్​, న్యూ ఛార్జీలు, మినిమమ్​ అమౌంట్​ డ్యూ, డ్యూ డేట్​తో పాటు ఇతర ముఖ్యమైన సమాచారాలు ఉంటాయి. స్టేట్​మెంట్​ జనరేట్​ అయిన తర్వాత.. బిల్లులు కట్టేందుకు సాధారణంగా 15 నుంచి 20 రోజుల సమయం ఉంటుంది. ఆలోపు కట్టేస్తే.. మీ మీద వడ్డీ భారం పడదు.

పేమెంట్​ రిమైండర్స్​, ఆటోమెటిక్​ పేమెంట్స్​, ఈసీఎస్​ సదుపాయం, స్పెండింగ్స్​ని మానిటర్​ చేయడం ద్వారా మీరు లేట్​ పేమెంట్​ ఫీజు భారం నుంచి తప్పించుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం