RBI interest rates : 7వసారి వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్​బీఐ ప్రకటన-rbi keeps key lending rate unchanged at 6 5 for 7th consecutive time ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rbi Interest Rates : 7వసారి వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్​బీఐ ప్రకటన

RBI interest rates : 7వసారి వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్​బీఐ ప్రకటన

Sharath Chitturi HT Telugu
Apr 05, 2024 10:47 AM IST

RBI interest rates : వడ్డీ రేట్లను వరుసగా 7వసారి యథాతంగా ఉంచింది ఆర్​బీఐ. ఈ మేరకు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా గవర్నర్​ ప్రకటన చేశారు.

వడ్డీ రేట్లపై ఆర్​బీఐ ప్రకటన..
వడ్డీ రేట్లపై ఆర్​బీఐ ప్రకటన..

RBI interest rates : మొనేటరీ పాలసీ కమిటీ మీటింగ్​ ముగింపు నేపథ్యంలో వడ్డీ రేట్లపై శుక్రవారం ప్రకటన చేశారు ఆర్​బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) గవర్నర్​ శక్తికాంత దాస్​. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు వెల్లడించారు. ఫలితంగా వరుసగా 7వసారి రెపో రేటును 6.5శాతంగా ఉంచింది ఆర్​బీఐ.

దేశంలోని బ్యాంక్​లకు డబ్బులను అప్పుగా ఇస్తుంది ఆర్​బీఐ. అప్పుపై వడ్డీ రేటును వసూలు చేస్తుంది. దానిని రెపో రేట్​ అంటారు. రెపో రేట్​ పెరిగితే.. బ్యాంక్​లకు కష్టమవుతుంది. అందుకే ఆ బ్యాంక్​లు కూడా వివిధ లోన్​లపై వడ్డీని పెంచుతాయి. రెపో రేటు తగ్గితే.. ఆర్​బీఐకి బ్యాంక్​లు ఇవ్వాల్సిన వడ్డీ కూడా తగ్గుతుంది. ఫలితంగా.. ప్రజలకు బ్యాంక్​లు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు దిగొస్తాయి.

RBI monetary policy meeting : ఇక రెపో రెట్లు మారకపోవడంతో.. ప్రస్తుతం దేశంలో ఉన్న వివిధ లోన్​లపై వడ్డీ రేట్లు కూడా మారే అవకాశం లేదు.

చివరిగా ఫిబ్రవరిలో జరిగిన ఆర్​బీఐ మొనేటరీ పాలసీ మీటింగ్​లోనూ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం జరిగింది. అయితే.. ఈసారి మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలన్న ప్రతిపాదనకు పూర్తిస్థాయి మెజారిటీతో లభించలేదు! 5:1తో ప్రతిపాదన పాసైంది. వడ్డీ రేట్లను ఈసారి మార్చాలని.. పాలసీ కమిటీ మీటింగ్​ సభ్యుల్లో ఒకరు అభిప్రాయపడ్డారు.

ద్రవ్యోల్బణం తమ టార్గెట్స్​కి దగ్గరిగానే ఉందని పేర్కొన్నారు శక్తికాంత దాస్​. కోర్​ ఇన్​ఫ్లేషన్​.. గత 9 నెలలుగా దిగొస్తోందని చెప్పుకొచ్చారు.

RBI interest rates latest news : "ద్రవ్యోల్బణం దిగొస్తోంది. కానీ ఫుడ్​ ప్రైజ్​ విషయంలో నెలకొన్న అనిశ్చితి కాస్త సవాలు విసురుతోంది. అందుకే.. ద్రవ్యోల్బణం పెరిగి రిస్క్​ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఎప్పటికప్పుడు ట్రాక్​ చేస్తున్నాము," అని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ తెలిపారు.

దేశంలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, అందుకే ద్రవ్యోల్బణంపై ఫోకస్​ చేయగలుగుతున్నామని శక్తికాంత దాస్​ అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కూడా సానుకూలంగానే ఉందని, 2024లో గ్లోబల్​ ట్రేడ్​ మరింత వేగంగా వృద్ధిచెందుతుందని అంచనా వేస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఇండియా లిక్విడిటీ పరిస్థితులు మార్చ్​ నెలలో మెరుగుపడినట్టు వివరించారు ఆర్​బీఐ గవర్నర్​.

WhatsApp channel

సంబంధిత కథనం