Stocks to buy in FY25: వచ్చే ఆర్థిక సంవత్సరంలో మంచి లాభాలను అందించే స్టాక్స్ ఇవే..-stocks to buy in fy25 top 5 mid cap small cap shares to buy in new fiscal ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy In Fy25: వచ్చే ఆర్థిక సంవత్సరంలో మంచి లాభాలను అందించే స్టాక్స్ ఇవే..

Stocks to buy in FY25: వచ్చే ఆర్థిక సంవత్సరంలో మంచి లాభాలను అందించే స్టాక్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu
Mar 30, 2024 03:16 PM IST

2025 ఆర్థిక సంవత్సరంలో కొనుగోలు చేయాల్సిన కొన్ని షేర్లను మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్ నుంచి టాటా కెమికల్స్, ఇండస్ టవర్, ఐఆర్ఈడీఏ, మహీంద్రా లైఫ్ సైసెస్, శక్తి పంప్స్ ముఖ్యమైనవి. వీటిని దీర్ఘకాలిక లక్ష్యంతో కొనుగోలు చేయాలని నిపుణులు సిఫార్సు చేశారు.

2024-05 ఆర్థిక సంవత్సరంలో కొనాల్సిన స్టాక్స్
2024-05 ఆర్థిక సంవత్సరంలో కొనాల్సిన స్టాక్స్

Stocks to buy in FY25: 2024 మార్చి నెలలో మూడు నెలల కనిష్టాన్ని తాకిన స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు 2024 ఆర్థిక సంవత్సరం చివరి పక్షం రోజుల్లో బలమైన ఒడిదుడుకులను చవిచూశాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో భారత స్టాక్ మార్కెట్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్ మంచి రిటర్న్స్ ను ఇచ్చే అవకాశం ఉంది.

స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్

గత కొన్ని నెలలుగా కొనసాగిన మందగమనం తర్వాత స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ తిరిగి పుంజుకుంటున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వీటి కొనుగోళ్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. అయితే తక్కువ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు మిడ్ క్యాప్ స్టాక్స్ వైపు మొగ్గు చూపాలని, అధిక రిస్క్ తీసుకోగల ఇన్వెస్టర్లు స్మాల్ క్యాప్ స్టాక్స్ వైపు మొగ్గు చూపవచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో టాటా కెమికల్స్, ఇండస్ టవర్, ఐఆర్ఈడీఏ, మహీంద్రా లైఫ్ స్పేస్, శక్తి పంప్స్ స్టాక్స్ ను కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అయితే, వీటిని దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణించాలని స్పష్టం చేస్తున్నారు.

స్మాల్ క్యాప్ బెటరా? లేక మిడ్ క్యాప్ స్టాక్సా?

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు మిడ్ క్యాప్ స్టాక్స్ వైపు చూడాలని స్టాక్స్ బాక్స్ రీసెర్చ్ హెడ్ మనీశ్ చౌధరి సూచించారు. "ప్రస్తుతం మార్కెట్లో మిడ్ క్యాప్ కంపెనీల ఆదాయం, లాభాల మార్జిన్లలో స్థిరమైన వృద్ధి కనిపిస్తోంది. ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్, తక్కువ ఆర్థిక నష్టాన్ని సూచించే కంపెనీలను ఇన్వెస్టర్లు పరిశీలించాలి. ఏదేమైనా, మార్కెట్ అస్థిరత కారణంగా స్వల్పకాలిక అంచనాలో అంతర్లీన ఇబ్బందులను గుర్తించడం చాలా ముఖ్యం. స్వల్పకాలిక ధోరణులను అంచనా వేయడంలో సవాళ్లు ఉన్నప్పటికీ, ఎంపిక చేసిన మిడ్-క్యాప్ కంపెనీలు దీర్ఘకాలికంగా లాభాలను అందించగలవు’’ అని మనీశ్ చౌధరి వివరించారు.

ముందు మీ రిస్క్ సామర్ధ్యం తెలుసుకోండి

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు వారి రిస్క్ సామర్థ్యం ఆధారంగా స్మాల్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ స్టాక్స్ ఎంచుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ‘‘భారీ ఒడిదుడుకుల తరువాత, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు పుంజుకున్నాయి. ఇది పెట్టుబడిదారులకు వారి లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం ఆధారంగా కొత్త అవకాశాలను అందిస్తుంది’’ అని స్టాక్ మార్కెట్ టుడే వ్యవస్థాపకుడు విఎల్ఎ అంబాలా అన్నారు.

దీర్ఘకాలిక కొనుగోళ్లకు ఈ స్టాక్స్ బెటర్

2025 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కొనుగోలు చేయాల్సిన షేర్ల గురించి మార్కెట్ నిపుణులు ఈ కింది సూచనలు చేశారు.

  • టాటా కెమికల్స్ (Tata Chemicals): టాటా కెమికల్స్ వార్షిక వృద్ధి (YoY) 16.26% గా ఉంది. టాటాకెమ్ (TATACHEM) స్టాక్స్ ను రూ .980 నుంచి రూ .1020 మధ్య కొనుగోలు చేయవచ్చు. ఇది స్వల్ప కాలంలోనే రూ. 1150 నుండి రూ .1400 కు చేరుకోవచ్చు.
  • ఇండస్ టవర్ (Indus Tower): ఇండస్ టవర్ వార్షిక వృద్ధి (YoY) 91.11% గా ఉంది. ఈ స్టాక్ ను రూ .21 నుండి రూ .23 మధ్య కొనుగోలు చేయవచ్చు.స్వల్ప కాలంలోనే ఇది రూ .26 నుండి రూ .40 కి చేరుకునే అవకాశం ఉంది.
  • ఐఆర్ఈడీఏ (IREDA): ఐఆర్ఈడీఏ వార్షిక వృద్ధి (YoY) 126.67% గా ఉంది. ఈ స్టాక్ ను రూ. 127 నుంచి రూ.135 మధ్య కొనుగోలు చేయవచ్చు. ఇది రూ.150 నుంచి రూ.170 కి చేరే అవకాశం ఉంది.
  • మహీంద్రా లైఫ్ స్పేస్ (Mahindra Lifespaces): మహీంద్రా లైఫ్ స్పేస్ లో దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంతో ఇన్వెస్ట్ చేయవచ్చు. వచ్చే 5-7 ఏళ్లలో ఆదాయాన్ని 5 రెట్లు పెంచాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత మార్కెట్ ధరతో కొనుగోలు చేస్తే, స్వల్ప కాలంలోనే 23% వృద్ధి సాధ్యమవుతుంది.
  • శక్తి పంప్స్ (Shakti Pumps): శక్తి పంప్స్ (ఇండియా) లిమిటెడ్ కంపెనీ కూడా వృద్ధి పథంలో కొనసాగుతోంది. కంపెనీ టాప్ లైన్, ఆర్డర్ బుక్ లను పరిశీలిస్తే రాబోయే కాలంలో కంపెనీ కచ్చితంగా బలమైన వృద్ధి సాధిస్తుందని అర్థమవుతుంది. ప్రస్తుత ధరలో కొనుగోలు చేస్తే, త్వరలోనే 24% వృద్ధి గ్యారెంటీ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకింగ్ కంపెనీలవి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగువి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

WhatsApp channel