(1 / 4)
2004: 2004 ఎన్నికలకు 6 నెలల ముందు నిఫ్టీ 1,550 దగ్గర ఉండేది. అక్కడి నుంచి 10.5శాతం రిటర్న్ ఇచ్చి, ఫలితాల రోజున 1,712 దగ్గరికి చేరింది. ఫలితాల నుంచి ఆరు నెలల తర్వాత.. 8.6శాతం మేర పెరిగి 1859 లెవల్స్‌కి చేరింది నిఫ్టీ. ఇక ఫలితాల తేదీ నుంచి ఏడాది కాలంలో 19.9శాతం రిటర్నులు ఇచ్చింది.
(2 / 4)
2009: 2009 ఎన్నికలకు 6 నెలల ముందు 2683 వద్ద ఉన్న ఎన్ఎస్ఈ నిఫ్టీ.. ఫలితాల సమయానికి 36.9శాతం మేర పెరిగి 3,672 వద్దకు చేరింది. అక్కడి నుంచి ఆరు నెలలకు ఇంకో 36.1శాతం పెరిగి 4,999 లెవల్స్‌కి చేరింది. అంతేకాదు.. ఫలితాల నుంచి ఏడాది కాలంలోనే ఏకంగా 86.3శాతం పెరిగింది నిఫ్టీ.
(3 / 4)
2014:- నాటి లోక్‌సభ ఎన్నికలకు 6 నెలల ముందు 6056 దగ్గర ఉన్న నిఫ్టీ.. ఫలితాల సమయానికి 18.9శాతం పెరిగి 7,203కి చేరింది. అక్కడి నుంచి ఆరు నెలలకు 16.4శాతం పెరిగి 8,383 లెవల్స్‌ని టచ్ చేసింది. ఫలితాల నుంచి ఏడాది కాలంలో 38.4శాతం వృద్ధి చెందింది నిఫ్టీ.
(4 / 4)
2019: ఆ లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల ముందు 10526 వద్ద ఉన్న నిఫ్టీ.. ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి 10.7శాతం మేర పెరిగి 11,657కి చేరింది. ఆ తర్వాత ఆరు నెలల పాటు పెద్దగా కదలలేదు! కేవలం 2.2శాతం మేర పెరిగి 11,913 దగ్గరికి చేరింది. ఇక ఏడాది కాలంలో 13.2శాతం మేర రిటర్నులు ఇచ్చింది ఎన్ఎస్ఈ.
ఇతర గ్యాలరీలు