Lok Sabha elections 2024: ఎన్నికల వేళ, ఈ 11 స్టాక్స్ ను కొనండి: స్టాక్ మార్కెట్ నిపుణుల సూచన
Lok Sabha election 2024: లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఈ సమయంలో మంచి లాభాలు అందించే ఈ 11 స్టాక్స్ ను మార్కెట్ నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఈ స్టాక్స్ తో స్వల్ప కాలంలోనే మంచి లాభాలు పొందవచ్చని హామీ ఇస్తున్నారు.
Stocks to buy in Lok Sabha election time: స్టాక్ మార్కెట్లో ఇటీవల భారీగా కరెక్షన్ చోటు చేసుకుంది. మదుపర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరి అయింది. మరోవైపు, లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో వ్యాల్యూ స్టాక్స్ (value stocks) వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా, స్వల్ప, మధ్య, దీర్ఘ కాలాల్లో మంచి రాబడులను ఇవ్వగల, ఫండమెంటల్ గా బలంగా ఉన్న స్టాక్స్ ను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. వారి కోసం స్టాక్ మార్కెట్ నిపుణులు ఈ 11 స్టాక్స్ ను సూచిస్తున్నారు.
బీజేపీ గెలుపుపై ధీమా
భారతీయ స్టాక్ మార్కెట్ ఇప్పటికే సమీప లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించబోతోందని భావిస్తోంది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడడం వల్ల ప్రధానంగా మౌలిక సదుపాయాలు, రక్షణ, విద్యుత్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఇటీవలి అమ్మకాల తర్వాత మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మౌలిక సదుపాయాలు, రక్షణ, చమురు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, పిఎస్ యూ లు, ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్ వైపు దృష్టి పెడుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు దీర్ఘకాలికంగా కొనుగోలు చేయాల్సిన స్టాక్స్ పై మార్కెట్ నిపుణులు 11 స్టాక్స్ ను సిఫారసు చేస్తున్నారు. అవి
- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
- నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)
- నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (NHPC)
- మహింద్ర అండ్ మహింద్ర (M&M)
- మారుతి సుజుకి (Maruti Suzuki)
- ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)
- హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లేదా హెచ్ఏఎల్ (HAL)
- ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)
- యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India)
- కెనరా బ్యాంక్ (Canara Bank)
ఈ స్టాక్స్ ను పరిశీలించండి
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు పీ ఎస్ యూ, బ్యాంకింగ్, ఆటో విభాగాల వైపు చూడాలని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ జైన్ సూచించారు. అలాగే, ఆటో, ఆయిల్ అండ్ పవర్, బ్యాంకింగ్ షేర్లు ఇతర విభాగాలను మించిపోవచ్చన్నారు.
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం..
2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), ఎన్టీపీసీ, ఎన్ హెచ్ పీసీ వంటి స్టాక్స్ వైపు చూడాలని పేస్ 360కి చెందిన అమిత్ గోయల్ సూచించారు. భారత ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచగలిగిందని, అధిక వడ్డీరేట్ల విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అమెరికా ఫెడ్ సమావేశం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీరేట్ల తగ్గింపునకు కాలపరిమితిని ప్రకటించే అవకాశం ఉందని బసవ్ క్యాపిటల్ ఫౌండర్ సందీప్ పాండే అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు బ్యాంకుల వద్ద రుణ వ్యాపారానికి ఎక్కువ డబ్బు ఉంటుందని తెలిపారు.
ఎన్నికల తరువాత ఈ స్టాక్స్ తో లాభాలు
లోక్ సభ ఎన్నికల తర్వాత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. అలాంటప్పుడు, బలమైన CASA ఉన్న భారతీయ బ్యాంకులు బలమైన త్రైమాసిక గణాంకాలను అందించగలవని భావిస్తున్నారు. కాబట్టి పీఎస్యూ బ్యాంక్ (PSU Banks) విభాగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ లను కొనుగోలు చేయవచ్చు. ప్రైవేట్ బ్యాంక్ విభాగంలో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేయవచ్చు.
మౌలిక వసతుల రంగంలోని స్టాక్స్ కూడా
పీఎస్ యూ సెగ్మెంట్ లోని బ్యాంకులు కాకుండా ఓఎన్ జీసీ, హెచ్ ఏఎల్ షేర్లను కొనుగోలు చేయవచ్చని బసవ్ క్యాపిటల్ కు చెందిన సందీప్ పాండే తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా (M&M), మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) షేర్లు కూడా లోక్ సభ ఎన్నికలకు ముందు ఆశాజనకంగా కనిపిస్తున్నాయని సందీప్ పాండే అన్నారు.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకింగ్ కంపెనీలవి, హిందుస్తాన్ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.