తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : స్థిరంగా పసిడ, వెండి ధరలు.. నేటి లెక్కలివే

Gold and silver rates today : స్థిరంగా పసిడ, వెండి ధరలు.. నేటి లెక్కలివే

Sharath Chitturi HT Telugu

16 May 2023, 6:08 IST

    • Gold and silver rates today : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్లాటీనం రేట్లు కూడా మారలేదు. పూర్తి వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (REUTERS)

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 56,650గా ఉంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,66,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,665గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

iVOOMi JeetX ZE: ఐవూమి నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, రేంజ్ ల్లో దీనికి సాటి లేదు..

Discounts on Hyundai cars: ఎక్స్టర్ ఎస్యూవీ సహా టాప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన హ్యుందాయ్

2024 Maruti Suzuki Swift: 2024 మారుతి సుజుకీ స్విఫ్ట్ రేపు లాంచ్: టాప్ మైలేజ్ ఇచ్చే హ్యాచ్ బ్యాక్ ఇదే..

EPFO alert: ఉద్యోగులకు షాక్; గ్రాట్యుటీ పరిమితి పెంపు అమలుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 61,800గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,18,000గా కొనసాగుతోంది.

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,650 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 61,800గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,350గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 56,700గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,850గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,800గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,700గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 61,850గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,650గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,800గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు సైతం మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,480గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 74,800గా కొనసాగుతోంది. ఆదివారం కూడా ఇద ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,800.. బెంగళూరులో రూ. 78,500గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 27,830గా ఉంది. ఆ ముందు రోజు కూడా ఇదే ధర పలికింది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,830గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)