LPG cylinder price hike : గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. నేటి నుంచే అమలు
01 March 2023, 8:25 IST
- LPG cylinder price hiked : దేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. నేటి నుంచే అమలు
LPG cylinder price hiked : దేశంలో సామాన్యులకు మరో షాక్ తగిలింది! ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెరిగింది. ఇక 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 350.50 పెరిగింది. తాజా రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
వివిధ ప్రాంతాల్లో ఇలా..
తాజా పెంపుతో.. దేశ రాజధాని ఢిల్లీలో 19కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 2,119.0కి చేరింది. ఇక 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 1103 నుంచి రూ. 1053కి పెరిగింది. ముంబైలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1052.5 నుంచి 1102.5కి చేరింది. కోల్‌కతాలో అది రూ. 1079 నుంచి రూ. 1129కి పెరిగింది. చెన్నైలో నిన్నటి వరకు రూ. 1068.50గా ఉన్న 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1118.5కి వెళ్లింది. హైదరాబాద్‌లో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,155కి చేరింది. విజయవాడ, వైజాగ్‌లోనూ ఇవే రేట్లు ఉన్నాయి.
LPG cylinder price in Hyderabad : ఇక వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ. 1870, ముంబైలో రూ. 2071.5, చెన్నైలో రూ. 2268గా ఉంది.
స్థానిక పన్నుల కారణంగా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తుంటారు. దేశంలోని ప్రతి ఇంటికి ఏడాది చొప్పున 12 సిలిండర్లు (14.2కేజీల) సబ్సిడీ రేట్లతో అందుతాయి. వీటికి అదనంగా తీసుకోవాలంటే.. మార్కెట్లో ఉన్న ధరకు తగ్గట్టు కొనాల్సిందే.
ఏడాదిలో రెండోసారి..!
LPG cylinder price : ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి 1న సిలిండర్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.