LPG cylinder price hike : ఎల్​పీజీ సిలిండర్​ ధర పెంపు.. 2023​ మొదటి రోజే బాదుడు షురూ!-the price of a commercial lpg cylinder increased by 25 rupees with effect from today ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  The Price Of A Commercial Lpg Cylinder Increased By 25 Rupees With Effect From Today

LPG cylinder price hike : ఎల్​పీజీ సిలిండర్​ ధర పెంపు.. 2023​ మొదటి రోజే బాదుడు షురూ!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 01, 2023 11:59 AM IST

LPG cylinder price hike : వాణిజ్య సిలిండర్​ ధర పెరిగింది. పెంచిన ధర ఆదివారం నుంచే అమల్లోకి వచ్చింది.

ఎల్​పీజీ సిలిండర్​ ధర పెంపు
ఎల్​పీజీ సిలిండర్​ ధర పెంపు

LPG cylinder price hike : దేశ ప్రజలకు.. నూతన ఏడాది మొదటి రోజునే షాక్​ తగిలింది! వాణిజ్య ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ. 25 పెరిగింది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్​ సిలిండర్​ ధర రూ. 1,769కి చేరింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి.

అయితే.. డొమెస్టిక్​ ఎల్​పీజీ సిలిండర్ ధర మాత్రం పెరగలేదు.

వాణిజ్య గ్యాస్​ సిలిండర్​ ధర పెంపుతో రెస్టారెంట్​, హోటల్​ ఖర్చులు పెరుగుతాయి. అయితే.. డొమెస్టిక్​ గ్యాస్​ సిలిండర్​ ధరను పెంచకపోవడంతో.. సామాన్యులపై భారం పడలేదు.

వాణిజ్య ఎల్​పీజీ సిలిండర్​ ధరలు..

  • ఢిల్లీ- సిలిండర్​కు రూ. 1768
  • Commercial LPG cylinder price in Hyderabad : ముంబై- సిలిండర్​కు రూ. 1721
  • కోల్​కతా- సిలిండర్​కు రూ. 1870
  • చెన్నై- సిలిండర్​కు రూ. 1917
  • హైదరాబాద్- సిలిండర్​కు రూ. 1798.5

డొమెస్టిక్​ ఎల్​పీజీ సిలిండర్​ ధరలు..

  • హైదరాబాద్​- సిలిండర్​కు రూ. 1,002
  • ఢిల్లీ- సిలిండర్​కు రూ. 1053
  • Domestic LPG cylinder price in Hyderabad : ముంబై- సిలిండర్​కు రూ. 1052.5
  • కోల్​కతా- సిలిండర్​కు రూ. 1079
  • చెన్నై- సిలిండర్​కు రూ. 1068.5

2022లో బాదుడే.. బాదుడు..!

LPG cylinder price hike latest news : చివరిగా.. 2022 జులై 6న డొమెస్టిక్​ సిలిండర్​ ధరలను పెంచాయి చెమురు సంస్థలు. నాడు సిలిండర్​పై రూ. 153.3 పెరిగింది. అయితే.. ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది సిలిండర్​ ధరలు భారీగానే పెరిగాయి. 2022 మార్చ్​లో సిలిండర్​పై రూ. 50 పెంచిన చమురు సంస్థలు.. మే నెలలో రూ. 3.50 పెంచాయి. ఆ తర్వాత జులైలో రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. కమర్షియల్​ ఎల్​పీజీ సిలిండర్​ ధరలు కూడా పెరిగాయి. ఆ తర్వాత కమర్షియల్​, డొమెస్టిక్​ సిలిండర్​ల ధరలు మళ్లీ కాస్త తగ్గాయి.

WhatsApp channel

సంబంధిత కథనం