'బండ' బాదుడు.. మళ్లీ పెరిగిన ఎల్​పీజీ సిలిండర్​ ధర-lpg cylinders price raised by rps 50 for homes ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'బండ' బాదుడు.. మళ్లీ పెరిగిన ఎల్​పీజీ సిలిండర్​ ధర

'బండ' బాదుడు.. మళ్లీ పెరిగిన ఎల్​పీజీ సిలిండర్​ ధర

HT Telugu Desk HT Telugu
May 07, 2022 09:22 AM IST

ఎల్​పీజీ సిలిండర్​ ధర మళ్లీ పెరిగింది. రెండు నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

సామాన్యుడిపై ధర భారం
సామాన్యుడిపై ధర భారం (AFP)

LPG cylinder price | రోజురోజుకు పెరుగుతున్న ధరలతో అల్లాడిపోతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడింది. వంటింట్లో ఉపయోగించే ఎల్​పీజీ సిలిండర్​ ధర.. రూ. 50 పెరిగింది. ఈ ధర శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి.

తాజా ప్రకటనతో.. 14.2 కేజీల ఎల్​పీజీ సిలిండర్​ ధర.. ఢిల్లీలో రూ. 999.50కు చేరింది. కాగా.. హైదరాబాద్​లో సిలిండర్​ ధర రూ. 1052గా ఉంది.

కాగా.. సిలిండర్​ ధరలు పెరగడం.. ఈ నెలలో ఇప్పటికే ఇది రెండోసారి. మే 1న.. ఎల్​పీజీ సిలిండర్​ మీద రూ. 102 పెరిగింది. ఐఓసీ ప్రకారం, మే 1న ఢిల్లీలో 19 కిలోల LPG సిలిండర్ ధర రూ. 2355.50గా ఉంది. ఏప్రిల్ 30 వరకు ఈ ధర రూ.2253 వరకు ఉండేది. ఇక కోల్‌కతాలో రూ.2455, ముంబైలో రూ.2307 ఉండగా.. చెన్నైలో వాణిజ్య సిలిండర్ల ధర రూ.2508కి పెరిగింది.

మార్చి 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.105 పెంచగా, మార్చి 22న రూ.9 తగ్గింది. అదే సమయంలో, అక్టోబర్ 2021 నుండి ఫిబ్రవరి 1, 2022 మధ్య వాణిజ్య సిలిండర్ ధర రూ.170 పెరిగింది. అక్టోబర్ 1న ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1736 ఉండగా నవంబర్ 2021లో 2000కు పెరిగింది. ఇక డిసెంబర్ 2021లో రూ. 2101కు పెరిగింది. దీని తర్వాత ఫిబ్రవరి 2022 మళ్లీ తగ్గి రూ.1907కి దిగి వచ్చింది. దీని తర్వాత, ఏప్రిల్ 1, 2022 నాటికి అది రూ. 2253కి చేరింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం