తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Divgi Torqtransfer Systems Ipo:ఈ ఐపీఓ పైననే అందరి దృష్టి

Divgi TorqTransfer Systems IPO:ఈ ఐపీఓ పైననే అందరి దృష్టి

HT Telugu Desk HT Telugu

02 March 2023, 22:09 IST

  • Divgi TorqTransfer Systems IPO: స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతున్న పరిస్థితుల్లో దివ్జీ టార్క్ ట్రాన్స్ ఫర్ సిస్టమ్స్ (Divgi TorqTransfer Systems) ఐపీఓ (IPO) తో ముందుకు వచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Divgi TorqTransfer Systems IPO: దివ్జీ టార్క్ ట్రాన్స్ ఫర్ సిస్టమ్స్ (Divgi TorqTransfer Systems) ఐపీఓ రెండో రోజైన గురువారం 38% సబ్ స్క్రైబ్ అయింది. మొత్తం 38,41,800 షేర్లకు గానూ 14,49,000 షేర్లకు బిడ్స్ వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

Mahindra XUV 3XO price : హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Gold and silver prices today : దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్​లో రేట్లు ఇలా..

Motorola Edge 50 Ultra : త్వరలో మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా లాంచ్​.. ఫీచర్స్​ ఇవేనా?

Tata Nexon CNG : బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​కి ‘సీఎన్​జీ’ టచ్​.. లాంచ్​ ఎప్పుడు?

Divgi TorqTransfer Systems IPO: ఆటో కంపోనెంట్స్ మ్యాన్యుఫాక్చరర్

దివ్జీ టార్క్ ట్రాన్స్ ఫర్ సిస్టమ్స్ (Divgi TorqTransfer Systems) మహారాష్ట్రలో ఉన్న ఆటోమోటివ్ కాంపొనెంట్స్ ను ఉత్పత్తి చేసే సంస్థ. ఇది సిస్టమ్ లెవెల్ ట్రాన్స్ ఫర్ కేసెస్ ను, టార్క్ కప్లర్లను, డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ లను ఉత్పత్తి చేస్తుంది. తాజా ఐపీఓలో రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లు 1.56%, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లు 22%, క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయర్స్ కు కేటాయించిన షేర్లు 6% సబ్ స్క్రైబ్ అయ్యాయి.

Divgi TorqTransfer Systems IPO: ఐపీఓ వివరాలు

దివ్జీ టార్క్ ట్రాన్స్ ఫర్ సిస్టమ్స్ (Divgi TorqTransfer Systems) ఐపీఓకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

  • ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 560 - 590
  • లాట్ సైజ్ 25.
  • ఈ ఐపీఓ ద్వారా సమీకరించాలనుకుంటున్న మొత్తం రూ. 412 కోట్లు.
  • సబ్ స్క్రైబ్ చేసుకోవడానికి మార్చి 1 నుంచి మార్చి 3 వరకు సమయం ఉంది.
  • మార్చి 9 న షేర్స్ అలాట్మెంట్, మార్చి 10న రీఫండ్, మార్చి 13న డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల బదిలీ ఉండే అవకాశముంది.
  • గ్రే మార్కెట్లో ఈ సంస్థ షేరు గురువారం రూ. 65 ప్రీమియంతో ట్రేడ్ అయింది.
  • మార్చి 14న ఇది స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవుతుంది.