తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Day Trading Stock For Today: ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ ఇవే

Day Trading Stock for Today: ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ ఇవే

13 March 2023, 7:29 IST

    • Day Trading Stock for Today: డే ట్రేడింగ్ చేసే వారు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్‍లు ఏవో నిపుణులు సూచించారు. అలాగే నిఫ్టీకి ముఖ్యమైన లెవెల్స్ ఏవో ఇక్కడ చూడండి.
Intraday Stocks Today: ట్రేడర్లూ.. నేడు ఈ స్టాక్‍లపై లుక్కేయండి
Intraday Stocks Today: ట్రేడర్లూ.. నేడు ఈ స్టాక్‍లపై లుక్కేయండి

Intraday Stocks Today: ట్రేడర్లూ.. నేడు ఈ స్టాక్‍లపై లుక్కేయండి

Day Trading Guide For Today: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం (SVB Crisis), యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాల కారణంగా భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో శుక్రవారం ట్రేడింగ్ సెషన్‍లో ఎన్ఎస్ఈ నిఫ్టీ 176.70 పాయింట్లు కోల్పోయి 17,412.90 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 671.15 పాయింట్లు క్షీణించి 59,135.13 వద్దకు పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ అత్యధికంగా 771.30 పాయింట్ల నష్టపోయి 40,485.45కు చేరింది. ప్రతికూలతల మధ్య నేడు (మార్చి 13, సోమవారం) భారత మార్కెట్లు ఎలా ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది, నిఫ్టీకి ముఖ్యమైన లెవెల్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

నష్టాలతోనే..

Day Trading Guide For Today: ఎస్‍జీఎక్స్ నిఫ్టీ ప్రకారం.. భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు కూడా నష్టాలతోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో ఉంది. శుక్రవారం సెషన్లో అమెరికన్ మార్కెట్లు కూడా నష్టపోయాయి.

నిఫ్టీకి ముఖ్యమైన లెవెల్స్ ఇవే

Day Trading Guide For Today: ఒకవేళ నిఫ్టీ ఇంకా పడితే 17,250 లెవెల్స్ వద్ద లోవర్ సపోర్ట్ ఉందని హెచ్‍డీఎఫ్‍సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి విశ్లేషించారు. “షార్ట్ టర్మ్‌లో నిఫ్టీ ట్రెండ్ బలహీనంగానే కొనసాగేలా కనిపిస్తోంది. శుక్రవారం సెషన్‍లో అన్‍ఫల్డ్ డౌన్‍సైడ్ గ్యాప్, పాజిటవ్ క్యాండిల్ ప్యాటర్న్ ఏర్పడింది. దీంతో మార్కెట్లు కాస్త పెరగొచ్చు. అయితే ఇది మదుపరులకు ఈవారం అమ్మకానికి అవకాశం ఇస్తుంది. నిఫ్టీ ఇక్కడ నుంచి పైకి వెళితే 17,600 లెవెల్స్ వద్ద తక్షణ రెసిస్టెన్స్ ఉంది. 17,250 లెవెల్స్ వద్ద లోవర్ సపోర్ట్ ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

Day Trading Stocks to Buy: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్

జేఎస్‍డబ్ల్యూ స్టీల్: బై అట్ రూ.679, టార్గెట్: రూ.704, స్టాప్ లాస్: రూ.669

ఆర్సీఎఫ్ (RCF) : బై అట్ రూ.102, టార్గెట్: రూ.107, స్టాప్ లాస్: రూ.100

కయెన్స్ టెక్నాలజీ: బై అట్ రూ.956, టార్గెట్: రూ.990, స్టాప్ లాస్: రూ.940

జైడస్ లైఫ్‍సైన్సెస్: బై అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ (సీఎంపీ), టార్గెట్: రూ.485 నుంచి రూ.490, స్టాప్ లాస్: రూ.465

మారుతీ సుజుకీ ఇండియా (MSIL): బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.8,750 నుంచి రూ.8,800, స్టాప్ లాస్: రూ.8,475

టాటా మోటార్స్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.450, స్టాప్ లాస్: రూ.420

ఎన్‍టీపీసీ: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.190, స్టాప్ లాస్: రూ.174

హెచ్‍డీఎఫ్‍సీ లైఫ్: బై అట్ రూ.490, టార్గెట్: రూ.505, స్టాప్ లాస్: రూ.483

బీహెచ్‍ఈఎల్: బై అట్ రూ.77, టార్గెట్: రూ.82, స్టాప్ లాస్: రూ.74

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)