తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For 23 March 2023 Stocks To Buy List For Traders

Day Trading Stocks Today: డే ట్రేడింగ్ గైడ్: ట్రేడర్లు నేడు గమనించాల్సిన స్టాక్స్

23 March 2023, 7:40 IST

  • Day Trading Stocks Today: నిపుణుల సూచనల ప్రకారం, డే ట్రేడర్లు నేడు ఏ స్టాక్‍లను ట్రాక్ చేయాలో, నిఫ్టీకి ముఖ్యమైన లెవెల్స్ ఏవో ఇక్కడ చూడండి.

Stocks to Buy Today: ట్రేడర్లు నేడు లుక్కేయాల్సిన స్టాక్స్.. నేటి ట్రేడర్స్ గైడ్
Stocks to Buy Today: ట్రేడర్లు నేడు లుక్కేయాల్సిన స్టాక్స్.. నేటి ట్రేడర్స్ గైడ్

Stocks to Buy Today: ట్రేడర్లు నేడు లుక్కేయాల్సిన స్టాక్స్.. నేటి ట్రేడర్స్ గైడ్

Day Trading Guide For Today: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. బుధవారం సెషన్‍లో ఎన్ఎస్ఈ నిఫ్టీ 44.40 పాయింట్లు ఎగిసి 17,151.90కి చేరింది. బీఎస్ఈ సెన్సెక్స్ 139.91 పాయింట్లు అధికమై 58,214.59 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ 104 పాయింట్లు పెరిగి 39,999కు వచ్చింది. అయితే నిఫ్టీలో వాల్యూమ్స్ మాత్రం 9 నెలల కనిష్ఠానికి చేరున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (మార్చి 23, గురువారం) స్టాక్ మార్కెట్లు ఎలా ఓపెన్ అయ్యే అవకాశం ఉందో, ట్రేడర్లు గమనించాల్సిన స్టాక్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.

ప్రతికూలమే..

Day Trading Guide For Today: భారత స్టాక్ మార్కెట్‍లో నేడు ప్రతికూలంగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎస్‍జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం 42 పాయింట్ల నష్టంతో ఉంది. బుధవారం సెషన్‍ను అమెరికా మార్కెట్లు నష్టాలతోనే ముగించాయి. నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి.

Day Trading Guide For Today: 17,200 లెవెల్స్ కంటే పైన స్థిరంగా నిలదొక్కుకుంటేనే నిఫ్టీ మరింత పెరుగుతుందనే నిర్ణయానికి రావొచ్చని హెచ్‍డీఎఫ్‍సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి అభిప్రాయపడ్డారు. “నిఫ్టీలో షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్‍గా టర్న్ అయినా.. ముఖ్యమైన అడ్డంకులను దాటి మార్కెట్‍ ముందకు వెళ్లడం లేదు. నిఫ్టీకి ప్రస్తుతం 17,200 తక్షణ రెసిస్టెన్స్‌గా ఉంది. నిఫ్టీ నేడు ఇంకా పడితే 17,020 లెవెల్స్ వద్ద సపోర్టు ఉంది” అని ఆయన విశ్లేషించారు.

Day Trading Stocks Today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ లిస్ట్

డాబర్: బై అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ (సీఎంపీ), టార్గెట్: రూ.550 నుంచి రూ.555, స్టాప్ లాస్: రూ.530

ఏసీసీ: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.1,775 నుంచి రూ.1,790, స్టాప్ లాస్: రూ.1,698

గెయిల్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.112, స్టాప్ లాస్: రూ.101

ఫెడరల్ బ్యాంక్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.135, స్టాప్ లాస్: రూ.124

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)