తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Boult Drift Plus: తక్కువ ధరకే బోల్ట్ నయా బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్.. అలాయ్ ఫ్రేమ్‍తో..

Boult Drift Plus: తక్కువ ధరకే బోల్ట్ నయా బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్.. అలాయ్ ఫ్రేమ్‍తో..

16 March 2023, 14:34 IST

    • Boult Drift+ Smartwatch: బోల్డ్ డ్రిఫ్ట్+ స్మార్ట్‌వాచ్ ఇండియాలో లాంచ్ అయింది. బడ్జెట్ ధరలో ప్రీమియం డిజైన్‍ను కలిగి ఉంది.
Boult Drift Plus: తక్కువ ధరకే బోల్ట్ నయా బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Boult Audio)
Boult Drift Plus: తక్కువ ధరకే బోల్ట్ నయా బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Boult Audio)

Boult Drift Plus: తక్కువ ధరకే బోల్ట్ నయా బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Boult Audio)

Boult Drift+ Smartwatch : ఎంతో పాపులర్ అయిన డ్రిఫ్ట్ (Drift) స్మార్ట్‌వాచ్‍కు ‘ప్లస్’ అప్‍గ్రేడ్‍ను బోల్ట్ ఆడియో బ్రాండ్ తీసుకొచ్చింది. బోల్ట్ డ్రిఫ్ట్+ (Boult Drift+) వాచ్‍ను లాంచ్ చేసింది. జింక్ అలాయ్ ఫ్రేమ్, ఐపీఎస్ ఎల్‍సీడీ డిస్‍ప్లేను ఈ వాచ్ (Smartwatch) కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తోంది. హెల్త్ ఫీచర్లు ఉంటాయి. బోల్డ్ డ్రిఫ్ట్ + స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

బోల్ట్ డ్రిఫ్ట్+ స్మార్ట్‌వాచ్ ధర, సేల్

Boult Drift+ Smartwatch Price: బోల్ట్ డ్రిఫ్ట్+ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,799గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌తో పాటు బోల్ట్ ఆడియో వెబ్‍సైట్‍లోనూ ఈ వాచ్ సేల్‍కు ఉంది. స్నో క్రీమ్, జెట్ బ్లాక్, బ్లాక్ కాఫీ, డార్క్ బ్లూ, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ వాచ్ లభిస్తోంది.

బోల్ట్ డ్రిఫ్ట్+ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Boult Drift+ Smartwatch Features: 1.85 ఇంచుల IPS LCD HD స్క్వేర్ షేప్ డిస్‍ప్లేను బోల్ట్ డ్రిఫ్ట్+ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. జింగ్ అలాయ్ ఫ్రేమ్ ఉండటంతో లుక్‍పరంగా ఇది కాస్త ప్రీమియమ్‍గా కనిపిస్తుంది. 150కుపైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఈ వాచ్ వస్తోంది. ఇందుకోసం వాచ్‍లో స్పీకర్, మైక్ ఉంటాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.1 వెర్షన్ ఉంటుంది. ఫోన్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ అసిస్టెంట్లకు సపోర్ట్ చేస్తుంది.

Boult Drift+ Smartwatch: హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్స్ లెవెల్స్ ట్రాకింగ్ కోసం ఎస్‍పీఓ2 సెన్సార్, బ్లడ్ ప్లెజర్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్ లాంటి హెల్త్ ఫీచర్లను బోల్ట్ డ్రిఫ్ట్+ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు నోటిఫికేషన్లను వాచ్‍లోనే పొందవచ్చు.

Boult Drift+ Smartwatch: సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా సహా మొత్తంగా 100 స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ Boult Drift+ వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 7 రోజుల వరకు ఈ వాచ్ బ్యాటరీ లైఫ్‍ను ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్‍ కోసం ఎక్కువగా వాడితే రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 2.5 గంటల్లో ఈ వాచ్ ఫుల్ చార్జ్ అవుతుంది. వాటర్, డస్ట్ రెసిస్టెట్స్ కోసం ఐపీ68 రేటింగ్‍తో ఈ నయా బోల్ట్ స్మార్ట్‌వాచ్ వస్తోంది.