తెలుగు న్యూస్  /  Business  /  Best Penny Stocks For The Long-term? Here Are 2 To Watch Out For

Best penny stocks for the longterm: లాంగ్ టర్మ్ కోసం ఈ పెన్నీ స్టాక్స్ ను చూడండి

HT Telugu Desk HT Telugu

23 November 2022, 22:47 IST

  • penny stocks: తక్కువ పెట్టుబడితో మంచి రాబడులు ఇచ్చే స్టాక్స్ కోసం అంతా వెతుకుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఎక్కువ కాలం ఎదురు చూడడానికి సిద్ధంగా ఉంటే, ఈ పెన్నీ స్టాక్స్ ను ఒకసారి పరిశీలించండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

penny stocks: పెన్నీ స్టాక్స్ విషయంలో తక్కువ పెట్టుబడి అనుకూల అంశమైతే, రిస్క్ ఎక్కువగా ఉండడం, ఊహించిన గ్రోత్ కనిపించకపోవడం ప్రతికూల అంశాలు. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతనే పెన్నీ స్టాక్స్ పై పెట్టుబడి పెట్టడం మంచిది. అయితే, ఈ కింద పేర్కొన్న పెన్నీ స్టాక్స్ పై నిపుణులు సానుకూలంగా స్పందిస్తున్నారు. అవేమిటో మీరూ చూడండి.

penny stocks: ఎంపిక ముఖ్యం

పెన్నీ స్టాక్స్ లో పబ్లిక్ కంపెనీలే ఎక్కువ. సరైన స్టాక్ ను ఎంపిక చేసుకుంటే, లాంగ్ రన్ లో పెట్టుబడి అనూహ్యంగా పెరగడం ఖాయం. ఫండమెంటల్స్ సరిగ్గా ఉండడం, ఇండస్ట్రీ సెక్టార్ వృద్ధి మార్గాన పయనిస్తుండడం, సరైన మేనేజ్ మెంట్.. ఇవన్నీ ఏ స్టాక్ కైనా చాలా ముఖ్యం. ఎంపిక సరిగ్గా లేకపోతే, పెట్టుబడి చూస్తుండగానే మాయం అవుతుంది.

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(National Aluminium Company Ltd - NALCO)

నాల్కో. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. మైనింగ్, మెటల్స్, పవర్ సెగ్మెంట్లలో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద integrated bauxite-alumina-aluminium-power complex. గత సంవత్సరం ఈ సంస్థ షేరు విలువ 45% తగ్గింది. ఈ సంవత్సరం జూన్ లో రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఈ సంస్థలో తన వాటాను అమ్మేశాడు. బొగ్గు సప్లైలో ప్రతికూలతలు, అల్యమినయం ధరల్లో తగ్గుదల, అంతర్జాతీయ పరిణామాలు,.. వీటి కారణంగా దీని షేరు ధర బాగా పడిపోయింది. అయినా, సంస్థ ఫండమెంటల్స్ ను పరిశీలిస్తే, అవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. లాంగ్ టర్మ్ లో షేరు విలువ భారీగా పెరిగే అవకాశముంది. అలాగే, ఈ సంస్థ డివిడెండ్ చెల్లింపు చరిత్ర కూడా చాలా బావుంది. గత నాలుగేళ్లలో సగటున 7.2% డివిడెండ్ చెల్లించింది.

ఇర్కాన్ ఇంటర్నేషనల్ (Ircon International Ltd.)

ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థ. ప్రధానంగా ఇంజినీరింగ్, నిర్మాణ రంగాల్లో ఉంది. హైవే, రైల్వే ప్రాజెక్టుల్లో ప్రధాన పోటీదారు. రైల్వే సెగ్మెంట్ నుంచి 90% ఆదాయం పొందుతుంది. మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిన కారణంగా ఈ సంస్థ భవిష్యత్ లోనూ భారీగా ప్రయోజనం పొందనుంది. అంతేకాకుండా, తన ప్రధాన పోటీదారు రైల్ వికాస్ నిగమ్ తో విలీనం అవుతోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అలా జరిగితే, రైల్వే సెగ్మెంట్లో ఈ సంస్థదే గుత్తాధిపత్యం అవుతుంది. సంస్థ గత నాలుగేళ్ల సగటు ఆర్ ఓ ఈ 10.5% గా ఉంది.

(ఇది సమాచారం కోసం మాత్రమే. స్టాక్ కొనుగోలు రికమెండేషన్ కాదు. మదుపర్లు జాగ్రత్తగా పరిశీలించి పెట్టుబడి పెట్టడం మంచిది)