తెలుగు న్యూస్  /  Business  /  Ather 450s Electric Scooter Launched In India Booking Will Start In July Check Details

Ather 450S Electric Scooter: ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఓలా ఎస్1 ఎయిర్‌కు పోటీగా..

01 June 2023, 17:40 IST

    • Ather 450S Electric Scooter: ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్‍లోకి వచ్చింది. ఓలా ఎస్1 ప్రోకు ఇది పోటీగా ఉంది.
Ather 450S Electric Scooter: ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ (ప్రతీకాత్మక చిత్రం)
Ather 450S Electric Scooter: ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ (ప్రతీకాత్మక చిత్రం)

Ather 450S Electric Scooter: ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ (ప్రతీకాత్మక చిత్రం)

Ather 450S Electric Scooter: చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్‍లోకి వచ్చింది. ఎంట్రీ లెవెల్‍లో ఏథెర్ ఎనర్జీ సంస్థ ఈ స్కూటర్‌ను విడుదల చేసింది. ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్‌కు ఈ ఏథెర్ 450ఎస్ పోటీనివ్వనుంది. సంప్రదాయ 125ccను పోలిన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ 450ఎస్ స్కూటర్ ఇస్తుందని ఏథెర్ ఎనర్జీ ప్రకటించింది. ధర వివరాలను వెల్లడించింది. జూలైలో ఏథెర్ 450ఎస్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. వివరాలివే.

ఏథెర్ 450ఎస్ బ్యాటరీ, రేంజ్

ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 115 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు (90 kmph)గా ఉందని ఏథెర్ ఎనర్జీ ప్రకటించింది. అయితే మిగిలిన ఫీచర్లను ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. రానున్న రోజుల్లో ఈ నయా స్కూటర్ పూర్తి వివరాలను ఏథెర్ ఎనర్జీ ప్రకటించనుంది. అయితే, అధునాతన ఫీచర్లను ఈ స్కూటర్ కలిగి ఉంటుందని లాంచ్ ఈవెంట్‍లో పేర్కొంది.

ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర

ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 1,29,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. జూలైలో 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కస్టమర్లు ఏథెర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో బుక్ చేసుకోవచ్చని ఏథెర్ ఎనర్జీ వెల్లడించింది. సవరించిన ఫేమ్-2 స్కీమ్ సబ్సిడీకి అనుగుణంగా ఈ స్కూటర్ ధర నిర్ణయించినట్టు చెప్పింది. ఆయా రాష్ట్రాల్లో ఈవీ పాలసీలకు అనుగుణంగా కస్టమర్లు సబ్సిడీ ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది.

ఇక ప్రస్తుతం ఏథెర్ నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.45 లక్షల నుంచి రూ.1.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ స్కూటర్‌లో 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉండగా.. 146 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 90 kmph గా ఉంది.

జూన్ 1వ తేదీన నుంచి ఫేమ్-2 కింద ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ 15 శాతానికి తగ్గటంతో ఏథెర్ ఎనర్జీ.. 450ఎక్స్ స్కూటర్ ధర పెంచనుంది. మే 31వ తేదీలోగా కొనుగోలు చేసిన వారు రూ.32,500 వరకు ఆదా చేసుకోవచ్చని ఆ సంస్థ ఇటీవల చెప్పింది. కాగా.. 450ఎక్స్ కొత్త ధరలను ఏథెర్ స్పష్టంగా ప్రకటించాల్సి ఉంది.