తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Angel One Dividend: భారీ డివిడెండ్ ప్రకటించిన స్టాక్ బ్రోకరేజ్ సంస్థ

Angel One dividend: భారీ డివిడెండ్ ప్రకటించిన స్టాక్ బ్రోకరేజ్ సంస్థ

HT Telugu Desk HT Telugu

22 March 2023, 22:11 IST

  • Angel One dividend: ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ ఏంజెల్ వన్ (Angel One Ltd) తమ షేర్ హోల్డర్లకు నాలుగో మధ్యంతర డివిడెండ్ (dividend) ను ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Angel One dividend: ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ ఏంజెల్ వన్ (Angel One Ltd) తమ షేర్ హోల్డర్లకు నాలుగో మధ్యంతర డివిడెండ్ (dividend) ను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి, నాలుగో డివిడెండ్ (dividend) ను ఏంజెల్ వన్ ప్రకటించింది.

Angel One dividend: రూ. 9.60

ఈ ఆర్థిక సంవత్సరం (FY2223) చివరి, నాలుగో డివిడెండ్ గా ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 9.60 చెల్లిస్తున్నట్లు ఏంజెల్ వన్ (Angel One Ltd) ప్రకటించింది. నాలుగో మధ్యంతర డివిడెండ్ (dividend) ప్రకటన నేపథ్యంలో ఏంజెల్ వన్ (Angel One Ltd) సంస్థ షేర్ విలువ బుధవారం, మార్చి 22న 3.28% పెరిగి, రూ. 1,127.65 లకు చేరింది. డివిడెండ్ (dividend) చెల్లింపునకు రికార్డు డేట్ గా మార్చి 31వ తేదీని ఏంజెల్ వన్ (Angel One Ltd) సంస్థ ప్రకటించింది. డివిడెండ్ (dividend) మొత్తాన్ని అర్హులైన షేర్ హోల్డర్లకు ఏప్రిల్ 20, 2023 లోగా చెల్లిస్తామని వెల్లడించింది.

Angel One dividend: రూ. 228 కోట్ల లాభాలు

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY23)లో బ్రోకరేజ్ సంస్థ ఏంజెల్ వన్ (Angel One Ltd) రూ. 228 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY22)లో సాధించిన లాభాల కన్నా 38.62% ఎక్కువ. స్టాక్ బ్రోకరేజ్ కార్యకలాపాలు నిర్వహించే ఏంజెల్ వన్ (Angel One Ltd) మార్కెట్ క్యాప్ రూ. 10,781.13 కోట్లు. ఇది ఈ రంగంలో గత రెండు దశాబ్దాలకు పైగా ఉంది. ఈ సంస్థకు 1.25 కోట్ల మంది క్లయింట్లు ఉన్నారు.