తెలుగు న్యూస్ / ఫోటో /
Top dividend stocks: భారీగా డివిడెండ్ ఇచ్చే ప్రభుత్వ రంగ స్టాక్స్ ఇవే..
Top dividend yielding stocks: స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే సమయంలో మదుపర్లు ముఖ్యంగా సంస్థ ఫండమెంటల్స్, లాభదాయకతతో పాటు షేర్ హోల్డర్లకు ఇచ్చే డివిడెండ్ ను కూడా పరిశీలిస్తారు. మంచి డివిడెండ్ ఇచ్చే బెస్ట్ ప్రభుత్వ రంగ సంస్థల లిస్ట్ ను రెలిగేర్ బ్రోకరేజ్ సంస్థ (Religare Broking) ప్రిపేర్ చేసింది. అవేంటో చూడండి..
(1 / 9)
Indian Oil: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2022 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 8.5 డివిడెండ్ అందించింది.(REUTERS)
(2 / 9)
SAIL: ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 2022 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 8. 8 డివిడెండ్ అందించింది. 2021 లో ఈ సంస్థ తమ మదుపర్లకు ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 2.8 డివిడెండ్ ఇచ్చింది.(Bloomberg)
(3 / 9)
REC: ఈ ప్రభుత్వ రంగ సంస్థ 2022 ఆర్థిక సంవత్సరంలో తమ మదుపర్లకు ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 11.7 ల డివిడెండ్ అందించింది. 2021లో ఈ విద్యుత్ రంగ సంస్థ షేర్ హోల్డర్ల కు రూ. 12.7 డివిడెండ్ ఇచ్చింది.
(4 / 9)
NMDC: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ 2022 ఆర్థిక సంవత్సరంలో తమ మదుపర్లకు ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 10.6 ల డివిడెండ్ అందించింది. 2021లో ఈ సంస్థ షేర్ హోల్డర్ల కు రూ. 7.8 డివిడెండ్ ఇచ్చింది.(MINT_PRINT)
(5 / 9)
NALCO: ప్రభుత్వ రంగ సంస్థ నాల్కొ(NALCO) 2022 ఆర్థిక సంవత్సరంలో తమ మదుపర్లకు ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.6.5 ల డివిడెండ్ అందించింది. 2021లో ఈ సంస్థ షేర్ హోల్డర్ల కు రూ. 3.5 డివిడెండ్ ఇచ్చింది.(REUTERS)
(6 / 9)
Power Finance Corp: ప్రభుత్వ రంగ సంస్థ పీఎఫ్సీ (Power Finance Corp) 2022 ఆర్థిక సంవత్సరంలో తమ మదుపర్లకు ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.12 ల డివిడెండ్ అందించింది. 2021లో ఈ సంస్థ షేర్ హోల్డర్ల కు రూ. 10 డివిడెండ్ ఇచ్చింది.
(7 / 9)
Coal India: ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India) 2022 ఆర్థిక సంవత్సరంలో తమ మదుపర్లకు ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 17 ల డివిడెండ్ అందించింది. 2021లో ఈ సంస్థ షేర్ హోల్డర్ల కు రూ.16 డివిడెండ్ ఇచ్చింది.(AFP)
(8 / 9)
ONGC: ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) 2022 ఆర్థిక సంవత్సరంలో తమ మదుపర్లకు ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 10.5 ల డివిడెండ్ అందించింది. 2021లో ఈ సంస్థ షేర్ హోల్డర్ల కు రూ. 3.6 డివిడెండ్ ఇచ్చింది.(HT_PRINT)
ఇతర గ్యాలరీలు