తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amul Milk Price Hike : అమూల్​ పాల ధరలు పెంపు.. నేటి నుంచే అమలు

Amul milk price hike : అమూల్​ పాల ధరలు పెంపు.. నేటి నుంచే అమలు

Sharath Chitturi HT Telugu

03 February 2023, 11:55 IST

  • Amul milk price hike : అమూల్​ పాల ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

Amul has increased price for milk.
Amul has increased price for milk.

Amul has increased price for milk.

Amul milk price hike : పాల ధరలను పెంచుతున్నట్టు అమూల్​ సంస్థ ప్రకటించింది. ధరల పెంపు నేటి నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో పాల ధరలు లీటరుకు గరిష్ఠంగా రూ. 3 పెరిగాయి.

ట్రెండింగ్ వార్తలు

Gold price today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర; 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,270

stock market today: ఈ రోజు ట్రేడింగ్ కోసం నిపుణులు సిఫారసు చేస్తున్న స్టాక్స్ ఇవే..

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

"అమూల్​ పౌచ్​ మిల్క్​ (అన్ని రకాలు) ధరలను సవరించాము. 2023 ఫిబ్రవరి 3 ఉదయం నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి," అని అమూల్​ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

అమూల్​ పాల ధరలు- తాజా రేట్లు..

ప్రాడక్టురూపాయి
అమూల్​ తాజా 500ఎంఎల్​27
అమూల్​ తాజా 1 లీటరు54
అమూల్​ తాజా 2 లీటర్లు108
అమూల్​ తాజా 6 లీటర్లు524
అమూల్​ తాజా 180ఎంఎల్​10
అమూల్​ గోల్డ్​ 500ఎంఎల్​33
అమూల్​ గోల్డ్​ 1 లీటర్​66
అమూల్​ గోల్డ్​ 6 లీటర్లు396
అమూల్​ కౌ మిల్క్​ 500ఎంఎల్​28
అమూల్​ కౌ మిల్క్​ 1 లీటర్​56
అమూల్​ ఏ2 బఫెల్లో మిల్క్​ 500ఎంఎల్​35
అమూల్​ ఏ2 బఫెల్లో మిల్క్​ 1 లీటర్​70
అమూల్​ ఏ2 బఫెల్లో మిల్క్​ 6 లీటర్లు420

ఏడాదిగా.. బాదుడు..!

Amul milk price increase : పాల ధరలు దేశంలో గత 10 నెలల్లోనే రూ. 12 పెరిగాయి! అంతకుముందు ఏడేళ్ల వరకు పాల ధరల్లో ఒక్క రూపాయి కూడా మార్పు రాలేదు. 2013- 2014 మధ్యలో పాల ధరలు లీటరుకు రూ. 8 పెరిగాయి.

ఇక వేసవిలో పాల ఉత్పత్తి ప్రతియేటా తగ్గుతుంది. డిమాండ్​ అందుకోవాలంటే.. పాల సంస్థలు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే.. రానున్న రోజుల్లో పాల ధరలు మళ్లీ పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి.

Amul milk price hike news latest : మరో పాల ఉత్పత్తి సంస్థ మథర్​ డెయిరీ కూడా ధరలను పెంచుతూ వస్తోంది. 2022 మార్చ్​ 5 నుంచి డిసెంబర్​ 27 మధ్యలో మథర్​ డెయిరీ పాల ధరలు లీటరుకు రూ. 57 నుంచి రూ.66కి చేరాయి. అంటే రూ. 6 పెరిగినట్టు.