Mother dairy milk price hike : మళ్లీ పెరిగిన మదర్​ డెయిరీ పాల ధరలు..-mother dairy milk price hiked from today check new rates and full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mother Dairy Milk Price Hike : మళ్లీ పెరిగిన మదర్​ డెయిరీ పాల ధరలు..

Mother dairy milk price hike : మళ్లీ పెరిగిన మదర్​ డెయిరీ పాల ధరలు..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 21, 2022 07:39 AM IST

Mother dairy milk price hike : పాల ధరలను పెంచుతున్నట్టు మదర్​ డెయిరీ ప్రకటించింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

మళ్లీ పెరిగిన పాల ధరలు..
మళ్లీ పెరిగిన పాల ధరలు.. (Mint)

Mother dairy milk price hike : దేశంలో ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్​ డెయిరీ.. పాల ధరలను మరోమారు పెంచింది. ఫుల్​ క్రీమ్​ మిల్క్​పై లీటరుకు రూ.1, టోకెన్​ మిల్క్​పై లీటరుకు రూ. 2 పెంచుతున్నట్టు ప్రకటించింది. పెంచిన పాల ధరలు.. ఢిల్లీ-ఎన్​సీఆర్​ ప్రాంతంలో నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా.. 500 ఎంఎల్​ ప్యాకెట్లలో పంపిణీ చేసే ఫుల్​ క్రీమ్​ మిల్క్​ ధరలను సంస్థ మార్చలేదు.

అందుకే ధరల పెంపు..

ఢిల్లీ- ఎన్​సీఆర్​ ఆధారిత పాల పంపిణీ సంస్థ మదర్​ డెయిరీ.. ధరలను పెంచడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి. ఢిల్లీ- ఎన్​సీఆర్​ ప్రాంతంలో రోజుకు 30లక్షల లీటర్ల పాలును సప్లై చేస్తుంది ఈ సంస్థ.

Mother dairy : తాజా పెంపుతో.. మదర్​ డెయిరీ ఫుల్​ క్రీమ్​ మిల్క్(లీటర్​)​ ధర రూ. 64కు చేరింది. టోకెన్​ మిల్క్​ ధర రూ. 50కి పెరిగింది. డెయిరీ ఫార్మర్స్​ నుంచి కొనుగోలు చేసే పచ్చి పాల ధరలతో పాటు ఇతర ధరలు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చెప్పింది.

"ఈ ఏడాది.. డెయిరీ ఇండస్ట్రీలో డిమాండ్​- సప్లై మధ్య వ్యత్యాసం కనిపించింది. ఫీడ్​, ఫాడర్​, రుతుపవనాల కారణంగా పచ్చి పాల సరఫరాపై ప్రభావం పడింది. అందుకే రేట్లు పెంచుతున్నాము," అని మదర డెయిరీ ప్రతినిధి వెల్లడించారు.

Mother dairy milk latest prices : పెంచిన ధరలతో రైతులు కూడా లబ్ధిచెందుతారని మదర డెయిరీ చెప్పింది. అదే సమయంలో కస్టమర్లకు నాణ్యమైన పాలు కూడా అందుతాయని స్పష్టం చేసింది.

ఢిల్లీ- ఎన్​సీఆర్​ ఆధారిత మదర్​ డెయిరీకి సఫల్​ రీటైల్​ ఔట్​లెట్లతో పాటు ఎన్నో మిల్క్​ బూత్​లు ఉన్నాయి. పాల ధరల్లో 75-80శాతం వరకు రైతులకు పంపిణీ చేస్తుంది ఈ సంస్థ.

Mother dairy milk price hike news : మదర డెయిరీకి సొంతంగా 9 ప్రాసెసింగ్​ ప్లాంట్లు ఉన్నాయి. థర్డ్​ పార్టీ ఫ్యాక్టరీలను కూడా తీసుకుంది. మొత్తం మీద.. రోజుకు 50లక్షల లీటర్ల పాలను ప్రాసెస్​ చేసే సామర్థ్యం ఈ కంపెనీ వద్ద ఉంది. తాజా కూరగాయలు, పండ్ల కోసం 4 పాంట్లు ఉన్నాయి. 16 అసోసియేటెడ్​ ప్లాంట్లలో ఎడిబుల్​ ఆయిల్​ను తయారు చేస్తుంది ఈ సంస్థ.

ఇండియాలో వార్షికంగా 210 మిలియన్​ టన్నుల పాలు ఉత్పత్తి అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. మదర్​ డెయిరీతో పాటు అమూల్​ పాలను కూడా ప్రజలు వినియోగిస్తూ ఉంటారు. ఢిల్లీ- ఎన్​సీఆర్​ మార్కెట్​లో ఈ సంస్థ రోజుకు 40లక్షల లీటర్ల పాలను పంపిణీ చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్