విజయవాడ అమూల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా! -amul recruitment apply for accounts assistant post check salary ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  విజయవాడ అమూల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

విజయవాడ అమూల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

HT Telugu Desk HT Telugu
Apr 22, 2022 06:11 PM IST

ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (AMUL) అకౌంట్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు విజయవాడలో పోస్టింగ్ ఉంటుంది.

AMUL
AMUL

ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (AMUL) అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు careers.amul.com లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు పోస్ట్-గ్రాడ్యుయేషన్ లేదా కామర్స్‌లో ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు ఏదైనా విభాగంలో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్‌ను  కలిగి ఉండాలి. అభ్యర్థులు 1 లేదా 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. ఈ పోస్టు అప్లై చేసుకునేవారు వయోపరిమితి 28 సంవత్సరాలు. ఎంపికైన అభ్యర్థులకు విజయవాడలో పోస్టింగ్ ఉంటుంది. అకౌంట్స్ అసిస్టెంట్ల జీతం సంవత్సరానికి రూ.రూ. 4,50,000 నుండి 4,75,000.

పోస్టు వివరాలు

పోస్ట్: అకౌంట్స్ అసిస్టెంట్

అర్హత: PG:ఏదైనా స్పెషలైజేషన్‌లో M.Com, ఫైనాన్స్‌లో MBA/PGDM 

UG:ఏదైనా స్పెషలైజేషన్‌లో బి.కామ్ ఫస్ట్

క్లాస్‌లో గ్రాడ్యుయేట్‌ను కలిగి ఉండాలి

వయోపరిమితి: 28 సంవత్సరాలు

వేతనం (ఏడాదికి): రూ. 4,50,000 నుండి రూ. 4,75,000.

అభ్యర్థి ఏదైనా విభాగంలో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి & మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్-గ్రాడ్యుయేషన్ లేదా కామర్స్‌లో ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ ఉండాలి. అభ్యర్థి కనీసం 1 నుండి 2 సంవత్సరాల  అనుభవం కూడా కలిగి ఉండాలి. వయస్సు 28 ఏళ్లు మించకూడదు. స్థానిక భాష తెలుగు పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

 

నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ లింక్ ద్వారా చూడవచ్చు

 

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్