తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Blockbuster Value Days: డిస్కౌంట్ ఆఫర్స్ తో ఆమెజాన్ ‘బ్లాక్ బస్టర్ వాల్యూ డేస్’ సేల్

Amazon Blockbuster Value Days: డిస్కౌంట్ ఆఫర్స్ తో ఆమెజాన్ ‘బ్లాక్ బస్టర్ వాల్యూ డేస్’ సేల్

HT Telugu Desk HT Telugu

20 May 2023, 17:55 IST

    • Amazon Blockbuster Value Days: మరో డిస్కౌంట్ సేల్ తో మరో సారి ఆమెజాన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఆమెజాన్ బ్లాక్ బస్టర్ వాల్యూ డేస్ పేరుతో ఈ సేల్ ను మే 19 నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించనుంది. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amazon Blockbuster Value Days: మరో డిస్కౌంట్ సేల్ తో మరో సారి ఆమెజాన్ (Amazon) వినియోగదారుల ముందుకు వచ్చింది. ఆమెజాన్ బ్లాక్ బస్టర్ వాల్యూ డేస్ (Blockbuster Value Days) పేరుతో ఈ సేల్ ను మే 19 నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించనుంది.

ట్రెండింగ్ వార్తలు

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

iQOO Z9x launch : ఇండియాలో ఐక్యూ జెడ్​9ఎక్స్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

Offers on Honda cars : మే నెలలో.. ఈ హోండా వెహికిల్స్​పై సూపర్​ ఆఫర్స్​!

Vivo Y18 launch : వివో నుంచి రెండు బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

Amazon Blockbuster Value Days: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు

ఈ సేల్ లో ఆమెజాన్ స్మార్ట్ ఫోన్స్ (smartphones), ల్యాప్ టాప్స్ (laptops), సౌండ్ బార్స్ (soundbars), హెడ్ ఫోన్స్ (headphones), టాబ్లెట్స్ (tablets), పీసీ యాక్సెసరీస్ (PC accessories), స్మార్ట్ వాచెస్ (smart watches), కెమెరాస్(cameras) తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను డిస్కౌంట్ ధరలకు అందించనుంది. యాపిల్, ఫైర్ బోల్ట్, డిజో, బోట్, నాయిస్, ఒప్పొ వంటి ఫేమస్ బ్రాండ్స్ ఉత్పత్తులు ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ఈ సేల్ లో లభిస్తాయి. అంతేకాదు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC) క్రెడిట్ కార్డు, లేదా డెబిట్ కార్డు తో కొనుగోలు చేసేవారికి అదనంగా 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆమెజాన్ బ్లాక్ బస్టర్ వాల్యూ డేస్ (Blockbuster Value Days) సేల్ మే 19వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు కొనసాగుతుంది.

Discount on these products: ఈ ఉత్పత్తులపై మంచి డిస్కౌంట్

  • ఫైర్ బోల్ట్ నింజా స్మార్ట్ వాచ్ రూ. 1099 లకే లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 1.69 అంగుళాల డిస్ ప్లే తో, దాదాపు 10 రోజుల బ్యాటరీ బ్యాక్ అప్ తో వస్తోంది.
  • డిజో 1.9 ఇంచ్ స్మార్ట్ వాచ్. ఇది కూడా ఈ సేల్ లో రూ. 1,099 లకు లభిస్తుంది.
  • బోట్ వేవ్ లీప్ కాల్. రూ. 1,599 లకు లభించే ఈ స్మార్ట్ వాచ్ 1.83 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్, గుండె వేగం, ఎస్పీఓ2 మానిటరింగ్, వెదర్ ఫోర్ కాస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.
  • బోట్ రాకర్స్ హెడ్ ఫోన్స్ రూ. 999 లకే లభిస్తాయి. టైప్ సీ తో దీన్ని చార్జ్ చేయవచ్చు. 20 గంటల ప్లే టైమ్ ఉంటుంది.
  • యాపిల్ ఐ పాడ్ ఎయిర్. ఇది రూ. 54,900 లకు లభిస్తుంది. ఇందులో 10.9 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది.యాపిల్ ఎం1 చిప్ అమర్చారు.
  • ఒప్పొ ఎయిర్ ప్యాడ్. ఈ టాబ్ రూ. 15999 లకు లభిస్తుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది.
  • డెల్ వోస్ట్రో 14 ఇంచెస్ ల్యాప్ ట్యాప్ రూ. 39,990 లకు లభిస్తుంది. ఇందులో విండోస్ 11, ఇంటెల్ ఐ3 -1115జీ4, 8జీబీ డీడీఆర్4, 512 జీబీ ఎస్ఎస్డీ ఉన్నాయి.
  • లెనొవా యోగా స్లిమ్ ల్యాప్ టాప్ ఈ సేల్ లో రూ. 69,990 లకు లభిస్తుంది. కూపన్ ద్వారా మరో వెయ్యి రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో 11th Gen Intel Core i5-11320H ప్రాసెసర్ ఉంది.

టాపిక్