Popular two wheeler launches of 2022: ఈ ఏడాది లాంచ్ అయిన 5 పాపులర్ బైక్స్ ఇవే..
28 December 2022, 16:24 IST
Popular two wheeler launches of 2022: 2022 సంవత్సరంలో రిలీజ్ అయిన బైక్స్ లో వినియోగదారుల ఆదరణ పొందిన టూ వీలర్స్ ఇవే.
జావా 42 బాబర్
Popular two wheeler launches of 2022: 2022లో విడుదల అయిన జావా బ్రాండ్ బైక్ మంచి పాపులారిటీ సంపాదించింది. దాంతో పాటు టీవీఎస్ నుంచి క్విర్కీ డిజైన్ తో వచ్చిన రొనిన్ కూడా బైకర్స్ ను విశేషంగా ఆకట్టుకుని, యూజర్స్ నుంచి మంచి రివ్యూస్ సాధించింది. మొత్తంగా, 2022లో లాంచ్ అయిన బైక్స్ లో పాపులర్ 5 బైక్స్ ఇవే..
1. Royal Enfield Hunter 350: రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350
బైకర్స్ మనసులను దోచుకునే బ్రాండ్స్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ మొదటి స్థానంలో ఉంటుంది. వినియోగదారులను ఆకట్టుకునే విషయంలో దశాబ్దాలుగా అది టాప్ బైక్ బ్రాండ్ గా నిలుస్తోంది. 2022లో రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి హంటర్ 350 (Royal Enfield Hunter 350) మోడల్ వచ్చింది. ఈ మోడల్ గురించి నెటిజన్లు పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి వచ్చిన చవకైన బైక్ (Royal Enfield Hunter 350) కూడా ఇదే కావడం విశేషం.
2. Bajaj Pulsar N160: బజాజ్ పల్సర్ ఎన్ 160
2022లో కొత్తగా బైక్ కొనాలనుకున్నవారు అత్యధికంగా ఎదురుచూసిన బైక్ ఈ బజాజ్ పల్సర్ ఎన్ 160 (Bajaj Pulsar N160). చాలా సంవత్సరాలుగా యూత్ హార్ట్ బీట్ గా పల్సర్ బ్రాండ్ నిలుస్తోంది. పవర్, స్టైల్, బీట్, లుక్స్, ప్రైస్.. అన్నింటిలోనూ ఆకర్షణీయంగా ఉండే మోడల్(Bajaj Pulsar N160) ఇది. ఈ పల్సర్ మోడల్ నుంచి 2022లో కొత్తగా ఎన్ 160(Bajaj Pulsar N160) వచ్చింది. నెటిజన్లు ఈ బైక్ గురించి కూడా విపరీతంగా వెతికారు.
3. Jawa 42 Bobber: జావా 42 బాబర్
2022లో జావా నుంచి వచ్చిన స్టైలిష్ బైక్ ఇది. లుక్స్ పరంగా ఇది (Jawa 42 Bobber) బెస్ట్ అని నెటిజన్లంతా ఏకతాటిన ఈ బైక్ కు ఓటేశారు. సింగిల్ సీట్ తో, రెట్రో లుక్స్ తో బైకర్స్ ను ఈ బైక్ ఆకట్టుకుంది. అయితే, సింగిల్ సీట్ ఆప్షన్ కొంతమందికి నచ్చలేదు. ప్రాక్టికల్ గా ఇబ్బందికరం అని చాలామంది ఫీల్ అయ్యారు. అలాగే, రాయల్ ఎన్ ఫీల్డ్ లేటెస్ట్ మోడల్స్ తో దీన్ని(Jawa 42 Bobber) కంపేర్ చేశారు.
4. 2022 Yamaha FZ-25: యమహా ఎఫ్ జీ 25
స్పోర్టీ లుక్స్ కు, రిలయబుల్ ఇంజిన్ కు, పవర్ పొజిషన్ కు యమహా పెట్టింది పేరు. యమహాను మాత్రమే విశ్వసించే వారు, యమహా మోడల్స్ గురించి మాత్రమే ఎదురు చూసే వారు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఉంటారు. యూత్ కి ఇప్పుడు, ఎప్పుడూ యమహా ఒక అబ్సెషన్. 2022లో యమహా నుంచి ఎఫ్ జీ 25 2022 (2022 Yamaha FZ-25) ఎడిషన్ రిలీజ్ అయింది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన మోడల్ ఇది. ఎఫ్ జీ 25 మోడల్ ను స్టైలింగ్ లో కొద్దిగా అప్ గ్రేడ్ చేశారు.
5. TVS Ronin : టీవీఎస్ రోనిన్
టీవీఎస్.. చవకైన, నమ్మకమైన, ప్యాకెట్ ఫ్రెండ్లీ బైక్ కంపెనీ. టీవీఎస్ నుంచి వచ్చిన బైక్స్ ధర కానీ, మెయింటెనెన్స్ కానీ చాలా అఫర్డబుల్ గా ఉంటాయి. 2022లో ఈ సంస్థ రొనిన్ (TVS Ronin) ను లాంచ్ చేసింది. టీవీఎస్ రెగ్యులర్ లుక్స్ అండ్ డిజైన్ తో కాకుండా, డిఫరెంట్, రెట్రో క్లాసిక్, అట్రాక్టివ్ డిజైన్ తో దీన్ని(TVS Ronin) తీసుకువచ్చారు. ఈ బైక్(TVS Ronin) పై కూడా యూజర్ల నుంచి మంచి రివ్యూస్ వచ్చాయి.
టాపిక్