తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Word Politics : ఈ పదాల చుట్టే ఏపీ రాజకీయాలు

AP Word Politics : ఈ పదాల చుట్టే ఏపీ రాజకీయాలు

Anand Sai HT Telugu

21 November 2022, 16:18 IST

    • Andhra Politics : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ ప్రజల్లోకి ఇప్పటికే వెళ్తోంది. ప్రధాన ప్రతిపక్షాలు సైతం రోడ్ల మీదకు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయితే ఏపీలో రాజకీయాలు కొన్ని పదాల చుట్టే తిరుగుతున్నాయి.
ఏపీ రాజకీయాలు
ఏపీ రాజకీయాలు

ఏపీ రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల(AP 2024 Elections) కోసం అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తేనే ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు. ప్రధానంగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు జనాల్లోకి వెళ్తున్నాయి. టీడీపీ(TDP), జనసేన(Janasena)లు అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే వైసీపీ(YSRCP) మాత్రం.. జనాల్లోకి వెళ్లి.. సంక్షేమ మంత్రాన్ని జపం చేస్తోంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని అడుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

ప్రధాన రాజకీయ పార్టీలు 2024 ఎన్నికల్లో గెలిచేందుకు..' ప్లీజ్ అవకాశమివ్వండి' అంటూ వెళ్తున్నాయి. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. గెలిపించకుంటే ఇవే చివరి ఎన్నికలు(Last Elections) అంటూ చంద్రబాబు కామెంట్ చేశారు. 'లాస్ట్ ఛాన్స్' అనే నినాదాన్ని చంద్రబాబు వినిపించారు. జనసేన పార్టీ(Janasena) మాత్రం 'ఒక్క ఛాన్స్'తో తనని తాను నిరూపించుకోవాలని అనుకుంటోంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి తానేంటో నిరూపించుకుంటానని జనసేనాని పవన్ ఆ మధ్య చెప్పుకొచ్చారు. అధికార వైసీపీ పార్టీ మాత్రం.. పాలన, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల అమలు లాంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి 'మళ్లీ ఛాన్స్' ఇవ్వాలని అడుగుతోంది. దాని ఆధారంగా తిరిగి ఓటు వేయమని ప్రజలను కోరుతోంది. .

ఎన్నికలకు కనీసం 18 నెలల సమయం ఉన్నప్పటికీ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు(Political Parties) ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభలతో రోడ్డు మీదకు వచ్చాయి. గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా వైసీపీ వెళ్తుంటే.. బాదుడే బాదుడు ద్వారా టీడీపీ(TDP), ప్రజలతో జనవాణి ఇంటరాక్షన్‌ల ద్వారా జనసేన క్రియాశీలకంగా ఇప్పటి నుంచే ప్రచారాన్ని మెుదలుపెట్టాయి. మరోవైపు బీజేపీ(BJP) కూడా కేంద్ర మంత్రులతో బహిరంగ సభలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పురోగతి సాధించాలని చూస్తోంది.

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజలకు మరింత చేరువయ్యేందుకు దోహదపడిందని వైసీపీ(YCP) వర్గాలు చెబుతున్నాయి. 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు 18,000 ఫిర్యాదులను స్వీకరించినట్టుగా తెలుస్తోంది. సమస్యలను వింటే.. ప్రజల్లో ఆగ్రహాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందని వైసీపీ అనుకుంటోంది. 'సంక్షేమం' అనే పదాన్ని గడపగడపలో నేతలు ఉపయోగిస్తున్నారు. 1.7 లక్షల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా బదిలీ చేయడం వల్ల పార్టీ ప్రజాభిమానం పొందేందుకు ఉపయోగపడిందని వైసీపీ నేతలు అంటున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu).. ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పులపై విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే మరోవైపు బ్యాలెన్సింగ్ పాలిటిక్స్ చేస్తూ.. సంక్షేమ మంత్రాన్ని కూడా జపిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో సంక్షేమ పథకాలు ప్రజలను సోమరులను చేస్తున్నాయని విమర్శించారు. కానీ ఇప్పుడు స్వరం మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. సంక్షేమ(Welfare) పాలనతోపాటుగా.. అవినీతి రహిత పాలన అందిస్తామని చెబుతున్నారు. ఇలా ఏపీ రాజకీయాలు, 'ఒక్కఛాన్స్', 'లాస్ట్ ఛాన్స్', 'సంక్షేమం' అనే పదాల చుట్టూ తిరుగుతున్నాయి.