తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Complaint: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలంటూ మోసం... 8 సామాజిక మాధ్యమాలపై టీటీడీ ఫిర్యాదు

TTD Complaint: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలంటూ మోసం... 8 సామాజిక మాధ్యమాలపై టీటీడీ ఫిర్యాదు

26 May 2023, 15:22 IST

    • TTD IT WING LODGES COMPLAINT:ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు టీటీడీ ఐటీ వింగ్ గుర్తించింది. ఈ మేరకు పలు సామాజిక మాధ్యామాలపై ఫిర్యాదు చేసింది.
నిరుద్యోగులను మోసం చేస్తున్న సామాజిక మాద్యమాలపై పోలీసులకు ఫిర్యాదు
నిరుద్యోగులను మోసం చేస్తున్న సామాజిక మాద్యమాలపై పోలీసులకు ఫిర్యాదు

నిరుద్యోగులను మోసం చేస్తున్న సామాజిక మాద్యమాలపై పోలీసులకు ఫిర్యాదు

TTD Latest News: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముఖ్య అలర్ట్ ఇచ్చారు. పదో తరగతి పాసైన వారికి టీటీడీ లో లక్ష రూపాయల వరకు జీతంతో ఉద్యోగాలంటూ ప్రకటన వస్తున్నాయని... వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇలాంటి సమాచారంతో నిరుద్యోగులను మోసం చేస్తున్న 8 సామాజిక మాధ్యమాలపై గురువారం టీటీడీ ఐటీ వింగ్ తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇలాంటి ప్రచారం చేస్తున్న సామాజిక మాధ్యమాల చిరునామాలను టీటీడీ ఐటీ విభాగం గుర్తించింది. వీటి పూర్తి వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. నిరుద్యోగులెవరు ఇలాంటి ప్రకటనలకు మోసపోవద్దని, టీటీడీ అధికారిక వెబ్ సైట్ www. tirumala.org ద్వారా ఇలాంటి విషయాలు ధ్రువీకరించుకోవాలని టీటీడీ ఐటీ జీఎం ఎల్ ఎం సందీప్ ఓ ప్రకటనలో కోరారు.

TTD Updates: మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్‌ లేని భక్తుల దర్శనానికి 24గంటల సమయం పడుతోంది. గురువారం 74,583మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 40,343 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా గురువారం 3.37కోట్ల రుపాయల ఆదాయం సమకూరింది. క్యూ కాంప్లెక్సుల వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్లు నిండిపోయాయి. టైమ్ స్లాటెడ్ దర్శనం టోకెన్లు లేకుండా క్యూలైన్లలోకి ప్రవేశించే వారికి దర్శనానికి 24గంటలకు పైగానే సమయం పడుతోంది.

ఇక తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. రాత్రి 7.30 గంటల నుండి అంకురార్పణ ఘట్టం ప్రారంభమైంది. ముందుగా సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలకు మే 26వ తేదీ ఉదయం 8.22 నుంచి 8.49 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వ‌హిస్తారు.