తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp Chief Chandrababu Security Increase By Nsg

Chandrababu Security: కుప్పం ఎఫెక్ట్.. చంద్రబాబుకు భారీగా భద్రత పెంపు

26 August 2022, 16:19 IST

    • Chandrababu Security: టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంచారు. ఈ మేరకు  ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చంద్రబాబుకు భద్రత పెంపు
చంద్రబాబుకు భద్రత పెంపు (twitter)

చంద్రబాబుకు భద్రత పెంపు

chandrababu naidu security increase by nsg: చంద్రబాబు కుప్పం పర్యటన ఉద్రిక్తతల మధ్య నడుస్తోంది. రెండోరోజు వైసీపీ బంద్ కు పిలుపునివ్వటం... ఫ్లెక్సీల చించివేతతో టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఓ దశలో చంద్రబాబు నడిరోడ్డుపై కూర్చొని ధర్నాకు కూడా దిగారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది.

ట్రెండింగ్ వార్తలు

AP Heat Wave : చాగలమర్రిలో ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత నమోదు-రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు

AP Pensions : మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి, ఎన్డీఏ నేతల డిమాండ్

AP Pensions Distribution : ఇంటింటికీ పెన్షన్లు లేదా నేరుగా ఖాతాల్లో, పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

AP Weather Updates : ఏపీలో భానుడి భగభగలు - 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు, ఇవాళ 56 మండలాల్లో తీవ్ర వడగాలులు

chandrababu security: గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఉండగా.. శుక్రవారం నుంచి అదనంగా మరో 20 మందిని నియమించారు. గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు చూసేవారు. కానీ ఇకపై డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో పనిచేస్తారు. మరోవైపు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమరదీప్‌సింగ్‌ నేతృత్వంలోని బృందం గురువారం తనిఖీ చేసింది. పలు గదులను నిశితంగా పరిశీలించింది. పలువురు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల్నీ సైతం ఎన్‌ఎస్‌జీ డీఐజీ కలిసినట్టు తెలుస్తోంది.

chandrababu kuppam tour: ఇదిలా ఉంటే తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు మూడో రోజు కుప్పంలో పర్యటన కొనసాగుతోంది. రెండో రోజులుగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో.. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.గురువారం కుప్పం ప్రధాన సెంటర్‌లో ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ విగ్రహాలు ఉన్న ప్రాంతం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ ఫ్లెక్సీల చించివేతకు నిరసనగా ఆ పార్టీ ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్‌తోపాటు నేతలు వైఎస్‌ఆర్‌ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా రావాల్సి ఉండటంతో పోలీసులు వైసీపీ నేతల్ని అడ్డుకున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహం పక్కనే ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ ఫ్లెక్సీలను చించేశారు. ఇది మరింత ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో... గురువారం కుప్పంలో బంద్ కు పిలుపునిచ్చింది వైసీపీ.

మొత్తంగా చంద్రబాబు కుప్పం టూర్... రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు టీడీపీ నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అయితే చంద్రబాబు టార్గెట్ వైసీపీ ముఖ్య నేతలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.