తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Duvvada Railway Station : దువ్వాడ రైల్వేస్టేషన్‌లో గాయపడిన విద్యార్థిని మృతి

Duvvada Railway Station : దువ్వాడ రైల్వేస్టేషన్‌లో గాయపడిన విద్యార్థిని మృతి

HT Telugu Desk HT Telugu

08 December 2022, 16:22 IST

    • Duvvada Student Died : దువ్వాడ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్-రైలుకు మధ్య ఇరుక్కుని ఓ విద్యార్థిని తల్లడిల్లిన వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. పరిస్థితి విషమించి చనిపోయింది.
విద్యార్థిని మృతి
విద్యార్థిని మృతి

విద్యార్థిని మృతి

విశాఖపట్నం(Visakhapatnam) దువ్వాడ రైల్వే స్టేషన్(Duvvada Railway Station)లో శశికళ అనే విద్యార్థిని ప్లాట్ ఫామ్-రైలుకు మధ్య ఇరుక్కుని.. బయటకు వచ్చేందుకు నానా తిప్పలు పడింది. సమారు గంటన్నరపాటు నరకం చూసింది. అయితే ఆమెను రక్షించిన అధికారులు.. ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పరిస్థితి విషమించి.. శశికళ చనిపోయింది. నడుము భాగంలో తీవ్రంగా ఒత్తుకుపోయి.. అవయవాలు దెబ్బతిన్నాయి. అంతర్గత రక్తస్రావం ఎక్కవ కావడంతో.. అత్యవసర చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించి శశికళ చనిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

ఏం జరిగిందంటే..

విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో అనుకోని ఘటన జరిగింది. అన్నవరానికి చెందిన శశికళ (20) కళాశాలకు వెళ్లేందుకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ లో దువ్వాడ(Duvvada)కు చేరుకుంది. రైలు దిగే క్రమంలో ఒక్కసారిగా రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయింది. గంటకుపైగా తీవ్రంగా ఇబ్బంది పడింది. అక్కడి వారు ఆమెను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. కానీ చాలా ఇబ్బంది అయింది.

రైల్వే రెస్క్యూ టీమ్(Rescue Team) వచ్చి.. ప్లాట్ ఫామ్ బద్ధలు కొట్టారు. గంటన్నర పాటు శ్రమించి.. యువతిని బయటకు తీశారు. అయితే అప్పటికే ఆమె పక్కటెముకలకు గాయాలు అయ్యాయి. అనంతరం యువతిని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి.. శశికళ చనిపోయింది. నడుము భాగంలో తీవ్రంగా ఒత్తుకుపోయి.. అవయవాలు దెబ్బతిన్నాయి. అంతర్గత రక్తస్రావం ఎక్కవ కావడంతో.. అత్యవసర చికిత్స అందించారు.