తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Rice Millers Requests For Rice Exports To Asian Countries From Andhra Pradesh

Rice Millers : బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పించాలని డిమాండ్

HT Telugu Desk HT Telugu

29 November 2022, 8:41 IST

    • Rice Millers ఆంధ్రప్రదేశ్‌ నుంచి బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పించాలని రైస్‌ మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరారు.  థాయ్‌లాండ్‌, మలేషియా, చైనా దేశాల్లో బియ్యం డిమాండ్ పెరగడంతో భారత్‌ నుంచి  ఎగుమతులకు నిబంధనలు సడలించాలని  రైస్‌ మిల్లర్లు కోరారు. 
బియ్యం ఎగుమతులకు అనుమతించాలని మంత్రికి విజ్ఞప్తి చేస్తున్న మిల్లర్లు
బియ్యం ఎగుమతులకు అనుమతించాలని మంత్రికి విజ్ఞప్తి చేస్తున్న మిల్లర్లు

బియ్యం ఎగుమతులకు అనుమతించాలని మంత్రికి విజ్ఞప్తి చేస్తున్న మిల్లర్లు

Rice Millers విదేశాలకు బియ్యం ఎగుమతికి అవకాశం కల్పించాలని రైస్ మిల్లర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. థాయ్ లాండ్, మలేషియా, చైనా తదితర దేశాలలో ఐఆర్ 64, రాజ్ ధాన్యం రకాలకు బాగా డిమాండ్ ఉన్నా ఆంక్షల కారణంగా ఎగుమతి చేయలేకపోతున్నామని మిల్లర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రణలో ఉంచేందుకు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

బియ్యం ఎగుమతులపై ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తే తమకు ఇబ్బంది లేకుండా ఉంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావును మిల్లర్లు కోరారు. రాష్ట్రంలోని జిల్లాల రైస్ మిల్లర్ల ప్రతినిధులు, సివిల్ సప్లయ్స్ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్ తో మంత్రి కారుమూరి నాగేశ్వరావరరావు సమావేశం నిర్వహించారు.

రైస్ మిల్లర్ల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిపివేయడం వల్ల తమకు కలుగుతున్న ఇబ్బందులను మిల్లర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. కేరళ రాష్ట్రానికి పంపించే బియ్యానికి కూడా అక్కడ పలు సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. కేరళలో ఉప్పుడు బియ్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. దాదాపు గంటన్నరపాటు ఉడికితేనే నాణ్యమైన బియ్యం గా వారు గుర్తిస్తాయి. తక్కువ సమయం తీసుకుంటే అంగీకరించారని తెలిపారు.

కేరళకు పంపించే బియ్యానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని మిల్లర్లు మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రైతుల నుంచి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు తప్పని సరిగా కొనుగోలు చేయాలని, తక్కువ ధర చెల్లిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రైతులకు నష్టం కలిగించే చర్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉపేక్షించరని స్పష్టం చేశారు. ఎగుమతులకు అనుమతి పై ముఖ్యమంత్రి గారితో చర్చిస్తానని మిల్లర్లకు హామీ ఇచ్చారు. మిల్లింగ్ ఛార్జీలు డబ్బులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.120కోట్లు ఇచ్చామన్నారు. డిసెంబర్, జనవరిలో మరో రెండు విడతల్లో నగదు జమ చేస్తామని మంత్రి వివరించారు. పౌరసరఫరాల సంస్థ హెడ్డాఫీసు నుంచే నేరుగా మిల్లింగ్ ఛార్జీలు చెల్లిస్తామని చెప్పారు. మిల్లర్ల సమస్యలు సహేతుకంగా ఉంటే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు.