తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  No Fly Zone In These Areas In Vizag Till November 13

PM Modi Vizag Tour : 13 వరకూ నో ఫ్లై జోన్.. విశాఖలో 7000 మంది పోలీసులు

HT Telugu Desk HT Telugu

10 November 2022, 14:29 IST

    • Modi Visakhapatnam Tour : ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. దీంతో సెక్యూరిటీపై అధికారులు ఫోకస్ పెట్టారు. నగరంలోని పలు ప్రదేశాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌ను రాబోయే నాలుగు రోజుల పాటు నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు.
ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)
ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో) (twitter)

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

నవంబర్ 11, 12 వ తేదీల్లో విశాఖపట్నం(Visakhapatnam)లో ప్రధాని మోదీ పర్యటన(PM Modi Tour) ఉంది. ఈ మేరకు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. నవంబర్ 13 వరకు 'నో ఫ్లై జోన్'(No Fly Zone) పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఎక్కువగా ఆంధ్రాయూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి. AU ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఉదయం 10.30 గంటల నుండి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. వేదిక నుండి ఐదు కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్ ఉంది.

UAV లేదా డ్రోన్‌లతో సహా ఏదైనా విమానయాన పరికరాలను పైన పేర్కొన్న ప్రాంతాలలో ఈ కాలంలో ఎగరడం నిషేధించారు. హెలిప్యాడ్(Helipad) వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసుల ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక రక్షణ బృందం (ఎస్పీజీ) బృందం సమావేశ స్థలాన్ని సందర్శించింది. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ వీవీఐపీ సందర్శన కోసం ఇక్కడికి వచ్చారు.

సభ జరిగే ప్రదేశానికి వెళ్లే వివిధ జంక్షన్లలో దాదాపు 7000 మంది ఏపీ పోలీసుల(AP Police)ను మోహరించారు. శివాజీ పార్క్ రోడ్డులో ఉన్నటువంటి స్థానిక కళ్యాణ మండపాలను పోలీసులకు బస, బోర్డింగ్ సౌకర్యాల కోసం ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. డీజీపీ రాజేంద్రనాథ్ గురువారం రానున్నారు. అన్ని కీలక పాయింట్ల వద్ద మూడు రోజుల పాటు డాగ్ స్క్వాడ్‌లను మోహరించనున్నారు. బహిరంగ సభ వేదిక వద్ద 700 మంది ఎస్‌ఐలు, 350 మంది సీఐలు, 150 మంది డీఎస్పీలు విధులు నిర్వహిస్తారు.

ప్రధాని మోదీ(PM Modi) విశాఖకు రానున్నారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం ప్రధాని ఇక్కడికి చేరుకోనుండగా, మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM Jagan) విశాఖకు వస్తారు. 12వ తేదీన రూ.10,842.47 కోట్ల విలువైన ప్రాజెక్ట్ పనులను ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన వర్చువల్ మోడ్‌లో ఉంటుంది. వాటిలో రెండు రైల్వే ప్రాజెక్టులు, పెట్రోలియం, సహజ వాయువు, మూడు రోడ్డు రవాణా, హైవేలు, ఒక మత్స్యకార ప్రాజెక్ట్ ఉన్నాయి.

ఇవి కాకుండా మరో రెండు రోజుల్లో మరో ఆరు ప్రాజెక్టుల ప్రారంభానికి ప్రధానమంత్రి కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టాక విశాఖ(Visakha) రావడం మూడోసారి. నవంబర్ 11న సీఎం జగన్(CM Jagan) విశాఖకు చేరుకుంటారు. ప్రధానితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11వ తేదీ రాత్రి 7 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు.

ఐఎన్ఎస్ డేగా నుంచి నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి మోదీ, సీఎం జగన్ వెళ్తారు. ఈఎన్సీ అధికారులతో రక్షణ రంగంపై మాట్లాడతారు. రాత్రి అక్కడే బస ఉంటుంది. నవంబర్ 12వ తేదీన ఉదయం ఏయూ గ్రౌండ్(AU Ground)కి వెళ్తారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఏయూలో జరిగే వేదిక నుంచే కీలక అభివృధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుడతారు.