తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  No Complaints On Google Location Tracking In India Praliament Discussion

AP In Parliament : పీఎం గతిశక్తి కింద ఏపీకి రూ. 202 కోట్లు

HT Telugu Desk HT Telugu

10 December 2022, 8:10 IST

    • AP In Parliament పీఎం గతిశక్తి కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.202 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిచ్చారు.  5 వేల కోట్ల వ్యయంతో రూపొందించిన ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 202 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. 
ఎంపీ విజయసాయిరెడ్డి
ఎంపీ విజయసాయిరెడ్డి (ANI)

ఎంపీ విజయసాయిరెడ్డి

గూగుల్ ట్రాకింగ్‌పై ఫిర్యాదులు లేవు…

ట్రెండింగ్ వార్తలు

VJA Doctor Family: విజయవాడ డాక్టర్ ఫ్యామిలీలో దారుణం, ఒకే కుటుంబంలో ఐదుగురి అనుమానాస్పద మృతి…

Bank Holiday-Dormant Accounts: వృద్ధుల ఖాతాల్లో పెన్షన్ సొమ్ములు పడతాయా..ఏపీలో Dormant ఖాతాలెన్నో లెక్కుందా!

AP Model School Marks: ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష మార్కులు విడుదల… ఆన్‌లైన్‌‌లో చెక్ చేసుకోండి ఇలా..

AP Summer Upadtes: ఆత్మకూరులో అదరగొట్టిన ఎండలు.. 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, నేడు 61 మండలాలకు వార్నింగ్

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2022 పేరుతో ఒక ముసాయిదా బిల్లును రూపొందించిందని, ప్రస్తుతం ఈ ముసాయిదా బిల్లు సంప్రదింపుల దశలో ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ డేటా ప్రొటెక్షన్‌ బిల్లులో వినియోగదారుల హక్కులు, విధులు, వారి వ్యక్తిగత సమాచార భద్రత, ఫిర్యాదు విధానం వంటి అంశాలను పొందుపరిచినట్లు మంత్రి తెలిపారు.

గూగుల్ ద్వారా వినియోగదారుని లొకేషన్ అక్రమంగా ట్రాకింగ్ చేస్తున్న విషయం మీ దృష్టికి వచ్చిందా? దీనిని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ఇతర దేశాల్లో గూగుల్ ద్వారా వినియోగదారుల లొకేషన్ అక్రమంగా ట్రాకింగ్ చేస్తున్నట్లు మీడియా కథనాల ద్వారా తమ దృష్టికి వచ్చింది. అయితే అటువంటి సంఘటనలు మన దేశంలో జరిగినట్లు ఎటువంటి ఫిర్యాదులు తమ దృష్టికి రాలేదని మంత్రి చెప్పారు.

గతి శక్తి మిషన్‌లో ఏపీకి నిధులు…

AP In Parliament పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది జీఐఎస్ ఆధారిత డిజిటల్ కాంపోనెంట్‌ అని కేంద్ర మంత్రి వివరించారు . అందులో వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన పోర్టల్స్‌ను 2021 అక్టోబర్‌లో ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఏకీకృత ప్రణాళిక రూపొందించడం, ప్రాజెక్టుల ప్రాధాన్యతను గుర్తించడం, ఏకకాలంలో అమలు పరచడం, ఖర్చులు, సమయం ఆదా చేయడం ప్రాజెక్టు మానిటరింగ్ పథకం లక్ష్యాలని చెప్పారు.

వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్ల ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ ఎకనమిక్ జోన్లకు మల్టీ మోడల్ కనెక్టివిటీని అభివృద్ధి చేసి తద్వారా లాజిస్టిక్ వ్యయం ఆదా చేయడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్ల మధ్య సమన్వయం కోసం కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్‌ సెక్రటరీస్ తో నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూప్‌ను సంస్థాగతంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇందులో కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబందించి సుమారు 2000 డేటా లేయర్లు అప్‌లోడ్ చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్ల ద్వారానే కాకుండా ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్‌ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపార్లమెంట్ ప్రాజెక్ట్ మాటనిటరింగ్ గ్రూపుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి సోం ప్రకాష్ తెలిపారు.

టాపిక్