తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Model School Marks: ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష మార్కులు విడుదల… ఆన్‌లైన్‌‌లో చెక్ చేసుకోండి ఇలా..

AP Model School Marks: ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష మార్కులు విడుదల… ఆన్‌లైన్‌‌లో చెక్ చేసుకోండి ఇలా..

Sarath chandra.B HT Telugu

30 April 2024, 7:09 IST

  • AP Model School Marks: ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష  ఫలితాలను  విద్యాశాఖ విడుదల చేసింది. 

ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల ఫలితాల విడుదల
ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల ఫలితాల విడుదల

ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల ఫలితాల విడుదల

AP Model School Marks: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 164 ఏపీ ఆదర్శ  పాఠశాలల్లో Model Schools ప్రవేశాల కోసం నిర్వహించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్షల Results ఫలితాలను ఏపీ పాఠశాల విద్యాశాఖ School Education విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన 31,376 విద్యార్థుల మార్కులను School education విద్యాశాఖ కమిషనర్‌ విడుదల చేయడం జరిగినది. పరీక్షలకు హాజరైన విద్యార్ధుల తల్లి తండ్రులంతా ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నవైబ్‌సైట్ల నుంచి ఫలితాలను పొందవచ్చని తెలిపారు. https://cse.ap.gov.in/ లేదా https://apms.apcfss.in/StudentLogin.do వెబ్ సైట్లలో మార్కుల్ని అందుబాటులో ఉంచారు.

ట్రెండింగ్ వార్తలు

Mangalagiri SI: పోస్టల్ బ్యాలెట్‌కు డబ్బులు తీసుకున్న మంగళగిరి ఎస్సై సస్పెన్షన్, రాజకీయ కుట్రగా ఆరోపిస్తోన్న ఎస్సై

AP Bureaucrats: ఏపీలో అంతే.. ఫేస్‌బుక్‌లో హీరోలు,విధుల్లో జీరోలు,పేలవమైన పనితీరు

Bengalore Rave Party: బెంగుళూరులో రేవ్‌ పార్టీ భగ్నం, పోలీసుల అదుపులో ఏపీ రాజకీయ నేతలు

Students in Kyrgyzstan: కిర్గిజిస్తాన్‌లో భారత విద్యార్థులు సేఫ్, అల్లర్లు అదుపులోకి, ఆందోళన వద్దన్న విదేశాంగ శాఖ

విద్యార్ధులు సాధించిన మార్కుల్ని విద్యార్థి హాల్ టికెట్ ద్వారా మార్క్స్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్ధులు ఎంచుకున్న మోడల్‌ స్కూల్‌లో అడ్మిషన్ కోసం అయా మోడల్ స్కూల్స్‌లో సంప్రదించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ పాఠశాలల్లో ఆరోతరగతి అడ్మిషన్ల Admissions కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు ఏప్రిల్ 21న పరీక్ష నిర్వహించారు. 2024-25 విద్యా సంవత్సరంకు గానూ రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాల(Model Schools)ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21న అర్హత పరీక్ష నిర్వహించారు.

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఏప్రిల్ 21 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. ప్రవేశ ఆరోతరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో నిర్వహించారు. తెలుగు/ ఇంగ్లీషు మాధ్యమాల్లో పరీక్షను రాసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు 31, 376మంది హాజరయ్యారు. విద్యార్ధులు సాధించిన మార్కుల ఆధారంగా వారు ఎంచుకున్న పాఠశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

తదుపరి వ్యాసం