తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Kadapa Crime News Toddler Recorded Father Suicide Video Goes Viral

Kadapa Crime : కడపలో దారుణ ఘటన, తండ్రి సూసైడ్ ను వీడియో తీసిన నాలుగేళ్ల కొడుకు!

28 May 2023, 7:52 IST

    • Kadapa Crime : తండ్రి ఆత్మహత్యను నాలుగేళ్ల కుమారుడు వీడియో తీసిన విషాద ఘటన ఏపీలో వెలుగుచూసింది. తీవ్ర మసస్థాపంతో అతడు సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
తండ్రి సూసైడ్ ను వీడియో తీసిన చిన్నారి
తండ్రి సూసైడ్ ను వీడియో తీసిన చిన్నారి (Image Credit : Unsplash)

తండ్రి సూసైడ్ ను వీడియో తీసిన చిన్నారి

Kadapa Crime : ఏపీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తండ్రి సూసైడ్ ను నాలుగేళ్ల కొడుకు ఫోన్ లో వీడియో తీశాడు. కడపలోని చిలకలబావి ప్రాంతంలో ఈ విషాద సంఘటన జరిగింది. మృతుడి సోదరి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసింది. అయితే మృతుడు తీవ్ర మనస్థాపంతో తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తండ్రి ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో చిన్న కొడుకు సెల్ ఫోన్ తో చిత్రీకరించాడు.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

అసలేం జరిగింది?

కడప నగరంలోని చిలకలబావి ప్రాంతానికి చెందిన షేక్ జమాల్ వలి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య అరిఫున్ గల్ఫ్ లో ఉపాధి కోసం వెళ్లింది. దీంతో అతని ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడిని జమాల్ వలి చూసుకుంటున్నాడు. అయితే కొద్ది రోజులుగా జమాల్ వలి తీవ్ర మనస్థాపంతో ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. ఏడాది కిందట అతడి తండ్రి మదార్ సాహెబ్ మరణంతో జమాల్ వలి మరింత కుంగిపోయినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపంలో ఉన్న జమాల్ వలి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన నాలుగేళ్ల కుమారుడిని వీడియో తీయమని చెప్పి ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఏంతెలియని ఆ చిన్నారి ఈ ఘటనను వీడియో తీశాడు. వీడియో బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వ‌చ్చింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

వీడియో కీలకం

సాయంత్రం ప్రార్థనలు ముగించుకుని తన తల్లి, సోదరి, ముగ్గురు కుమార్తెలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండగా, జమాల్ తనతో పాటు తన నాలుగేళ్ల కొడుకును ఇంటిలోని రెండో అంతస్తుకు తీసుకువెళ్లాడు. అక్కడ తన మొబైల్ ఫోన్‌ను చిన్నారికి ఇచ్చి, అతనిని వీడియో తీయమని అడిగాడు. తన తండ్రి ఆత్మహత్య గురించి ఎటువంటి క్లూ లేని చిన్న పిల్లవాడు అతని సూచనలను పాటించి తన తండ్రి ఆత్మహత్యను చిత్రీకరించాడు. జమాల్ చున్నీ తీసుకుని ఒక చివర సీలింగ్ ఫ్యాన్ హుక్కు, మరో చివర మెడకు కట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతలో ఏదో తప్పు జరుగుతోందని గ్రహించిన చిన్న పిల్లవాడు బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. కొద్దిసేపటికే, పిల్లల ఏడుపు విని ఇతర కుటుంబ సభ్యులు పైకి పరుగెత్తారు.

అక్కడ జమాల్ ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతడిని కిందకు దించి కడపలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే అప్పటికే జమాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కుటుంబీకులు కడప 2వ పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ జయ రాములు, అతని బృందం రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని కేసు నమోదు చేసి జమాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఫోన్ లాక్ కాకముందే ‘సూసైడ్ వీడియో’ జమాల్ మొబైల్ ఫోన్ నుంచి అతని బంధువు ఫోన్‌కి ఫార్వార్డ్ అయిందని ఎస్ఐ రాములు చెప్పారు. ప్రస్తుతం జమాల్ ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో వీడియో ఆధారం కీలకం అని పోలీసులు అంటున్నారు.