తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Ooty Tour : తిరుపతి టు ఊటీ.. తక్కువ ధరలోనే 6 రోజుల ట్రిప్ - వివరాలివే

IRCTC Ooty Tour : తిరుపతి టు ఊటీ.. తక్కువ ధరలోనే 6 రోజుల ట్రిప్ - వివరాలివే

04 June 2023, 15:05 IST

    • IRCTC Tirupati  Ooty Tour: ఊటీకి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఐఆర్‌సీటీసీ టూరిజం మీకు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి ఊటీకి సరికొత్త ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఊటీ టూర్ ప్యాకేజీ
ఊటీ టూర్ ప్యాకేజీ (twitter)

ఊటీ టూర్ ప్యాకేజీ

IRCTC Tourism Ooty Package: సమ్మర్ టైంలో కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేస్తుంటారుటూరిస్టులు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాలను ఎంచుకుంటారు. అయితే మీకోసం తక్కువ ధరలోనే రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా తిరుపతి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX TIRUPATI ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జూన్ 13, 2023 తేదీన అందుబాటులో ఉంది.

  • మొదటి రోజు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.50 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. రాత్రి అంత జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు మార్నింగ్ 08.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు. హోటల్ కి చెకిన్ అయిన తర్వాత... మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఊటీ లేక్ చూస్తారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.
  • మాడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత దొడబెట్ట, టీ మ్యూజియం, పైకార ఫాల్స్ కు వెళ్తారు. రాత్రి కూడా ఊటీలోనే బస చేస్తారు.
  • నాల్గో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత కున్నూరుకు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రి ఊటీలోనే స్టే చేస్తారు.
  • 5వ రోజు ఉదయం హోటల్ నుంచి కోయంబత్తూరు వెళ్తారు. సాయంత్రం 04.35 నిమిషాలకు రైలు ప్రయాణం మొదలవుతుంది.
  • ఆరో రోజు రాత్రి 12.05 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

ఊటీ ప్యాకేజీ ధరలు:

తిరపతి- ఊటీ టూర్ ప్యాకేజీ చూస్తే… కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 29620 ధర ఉంది. ఇక డబుల్ షేరింగ్ కు రూ. 15880 ధర ఉంటే… ట్రిపుల్ షేరింగ్ కు రూ.12540 గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి./www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి స్టాండర్ట్ అండ్ చిన్న పిల్లలకు ఉండే టికెట్ ధరలతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.