తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Uco Bank Fraud : బ్యాంకుకే కన్నం వేసిన గోల్డ్ అప్రైజర్….

UCO Bank Fraud : బ్యాంకుకే కన్నం వేసిన గోల్డ్ అప్రైజర్….

HT Telugu Desk HT Telugu

31 January 2023, 12:35 IST

    • UCO Bank Fraud పనిచేస్తున్న బ్యాంకుకే టోకరా వేశాడో గోల్డ్ అప్రైజర్‌.  నకిలీ బంగారాన్ని కుదవ పెట్టిన  కోట్ల రుపాయలు దోచేశాడు. రెండేళ్లుగా  సాగుతున్న వ్యవహారం ఉన్నతాధికారుల తనిఖీల్లో బయటపడింది. బంధువులు, స్నేహితుల పేర్లతో నకిలీ బంగారాన్నితాకట్టు పెట్టి భారీ మోసానికి పాల్పడిన  నిందితుడ్నికాకినాడ పోలీసులు అరెస్ట్‌చేశారు. 
నకిలీ బంగారం కేసు వివరాలను వెల్లడిస్తున్న కాకినాడ పోలీసులు
నకిలీ బంగారం కేసు వివరాలను వెల్లడిస్తున్న కాకినాడ పోలీసులు

నకిలీ బంగారం కేసు వివరాలను వెల్లడిస్తున్న కాకినాడ పోలీసులు

UCO Bank Fraud కాకినాడ యూకో బ్యాంకులో భారీ మోసం వెలుగు చూసింది. బంగారు ఆభరణాలకు విలువ కట్టే గోల్డ్‌ అప్రైజర్‌ తాను పనిచేస్తున్న బ్యాంకును రూ.2.45 కోట్లకు టోకరా వేశాడు. ఎవరికి అనుమానం రాకుండా నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టేసి కోట్లలో కొట్టేశాడు.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

కాకినాడ యూకో బ్యాంక్‌లో గోల్డ్‌ అప్రైజర్‌గా పని చేస్తున్న రామకృష్ణారావు పేటకు చెందిన తాడోజు శ్రీనివాసరావు 8.316 కిలోల నకిలీ బంగారు నగలను కుదువ పెట్టి రూ.2,45,84,000 మొత్తాన్ని రుణాలుగా తీసుకున్నాడు. గత 15 నెలలుగా 60 విడతల్లో 30 మంది పేర్ల మీద రుణాలు పొందినట్లు గుర్తించారు.

కాకినాడ UCO బ్యాంక్ లో నకిలీ బంగారం తనఖా పెట్టి 60 బంగారు రుణాలను పొందడంపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 2,45,84,000- రూపాయలు పొందడం ద్వారా బ్యాంకును మోసం చేసినట్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టిన 31 మందిపై UCO బ్యాంక్ జోనల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుపై కాకినాడ టూటౌన్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయక ముందే గోల్డ్ అప్రైజర్ పరారవ్వడంతో అతడిని పట్టుకోవడానికి పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గోల్డ్ అప్రయిజర్ తాడోజు శ్రీనివాసరావు ఏడాదిన్నరగా UCO బ్యాంకు లో బంగారు నగలను తనఖా పెడుతున్నట్లు గుర్తించారు. మొత్తం 30 మంది పేరిట 60 సార్లు 8 కేజీ ల 316 గ్రాముల నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలను తీసుకొన్నట్లుగా గుర్తించినట్లు కాకినాడ పోలీసులు వెల్లడించారు. .

కేసులో ప్రధాన నిందితుడు తాడోజు శ్రీనివాసరావుతో పాటు అతనికి సహకరించిన అతని బంధువులు అయిన కాకినాడకు చెందిన కొత్తల రాంబాబు, కొండేపూడి కొండరాజు లను అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

టాపిక్