తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Godavari Delta : 30 నుంచి గోదావరి డెల్టాకు నీరు….

Godavari Delta : 30 నుంచి గోదావరి డెల్టాకు నీరు….

HT Telugu Desk HT Telugu

27 November 2022, 11:28 IST

    • Godavari Delta గోదావరి డెల్టాకు నవంబర్‌ 30 నుంచి నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి డెల్టా ఆ‍యకట్టుకు నీటి విడుదలపై జిల్లా సాగునీటి సలహామండలిలో నిర్ణయించారు.  రబీ పంటకు నూరు శాతం నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. 
30 నుంచి గోదావరి డెల్టాకు సాగు నీటి విడుదల
30 నుంచి గోదావరి డెల్టాకు సాగు నీటి విడుదల

30 నుంచి గోదావరి డెల్టాకు సాగు నీటి విడుదల

Godavari Delta కాకినాడ జిల్లా పరిధిలోని గోదావరి డెల్టా, ఏలేరు, పీబీసీ, పంపా రిజర్వాయర్ల ద్వారా రబీలో పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించాలని జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

సుబ్బారెడ్డి సాగర్‌ కింద నాలుగు వేల ఎకరాలు సాగుకు మాత్రమే అనుమతించ నున్నట్లు ప్రకటించారు. ఈనెల 30 నుంచి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేయనున్నారు. డిసెంబరు 10 నుంచి ఏలేరు కాలువలకు, పంపా రిజర్వాయర్‌, సుబ్బారెడ్డిసాగర్‌ ఆయకట్టుకు డిసెంబరు 25 నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.

కాకినాడ కలెక్టరేట్‌లో కాకినాడ జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాన్ని కలెక్టర్‌ కృతికాశుక్లా అధ్యక్షతన నిర్వహించారు. సలహా మండలి కన్వీనర్‌, ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ పర్యవేక్షక ఇంజినీరు కె.నరసింహమూర్తి అందుబాటులో ఉన్న జలాల లభ్యతను జిల్లా నాయకులకు వివరించారు.

గోదావరి డెల్టాకు 101.505 టీఎంసీల నీటి లభ్యత ఉందని, కాకినాడ జిల్లాలో గోదావరి డెల్టా ఆయకట్టు కింద 1,37,848 ఎకరాలు, పీబీసీ కింద 32,507 ఎకరాలకు రబీలో నూరుశాతం సాగునీరు ఇచ్చేందుకు ఆయన ప్రతిపాదించారు. దీనికి సాగునీటి సలహా మండలి ఆమోదించింది. ఏలేరు కింద 53,017, పంపా రిజర్వాయర్‌ కింద 12,005 ఎకరాలకు నూరుశాతం ఆయకట్టుకు, సుబ్బారెడ్డిసాగర్‌ కింద నాలుగు వేల ఎకరాలకే సాగునీరు అందించాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గొల్లప్రోలు పర్యటనలో ఏలేరు ఆధునికీకరణకు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారని, వీటిని త్వరగా ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాండవ ఆధునికీకరణకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు.